Don't Miss!
- Finance
ధనిక దేశంలో ఇంధన సంక్షోభం.. గ్యాస్ బిల్లులు చెల్లించేందుకూ అవస్థలు
- News
చైనాకు అమెరికా భారీ షాక్ - కూల్చివేత..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రోలెక్స్ పాత్రతోనే న్యూ సర్‌ప్రైజ్.. విక్రమ్ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతొంది. విక్రమ్ సినిమాతో ఇటీవల సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా అతని ప్రత్యేకమైన యూనివర్స్ కూడా క్రియేట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అతను క్రియేట్ చేసిన పాత్రలతో రాబోయే పదేళ్ల కాలంలో మరిన్ని డిఫరెంట్ సినిమాలను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే విక్రమ్ సినిమాలో అతను ప్రముఖ హీరోలను చూపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కమలహాసన్ తో పాటు విజయ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ ఇద్దరినీ కూడా అద్భుతంగా చూపించాడు. అలాగే మరొక ఊహించని పాత్రలో రోలెక్స్ గా సూర్య కనిపించిన విషయం తెలిసిందే. విక్రమ్ సినిమాలో ఆ పాత్ర పవర్ఫుల్గా వర్కౌట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని కలెక్షన్స్ అందుకోవడానికి ఉపయోగపడింది. అయితే ఇప్పుడు లోకేష్, విజయ్ ను హీరోగా పెట్టి మరో సినిమా చేయబోతున్నాడు.

ఇంతకుముందు వీరి కలయికలో మాస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా విక్రమ్ తాలూకు సంబంధించిన కథను కూడా కలిపే అవకాశం ఉందట. అంటే ఆ సినిమాలోని పాత్రలు విజయ్ 67 వ సినిమాలో కూడా కనిపించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే అవన్నీ ఒక తరహాలో ఉంటే రోలెక్స్ పాత్రతో దర్శకుడు లోకేష్ మరో కొత్త తరహా కథను కూడా రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అతన్ని మెయిన్ హీరోగా పెట్టి మరొక పవర్ఫుల్ కథను తెరపై తీసుకువచ్చే అవకాశం ఉందట. విజయ్ సినిమా తర్వాత రోలెక్స్ పాత్రను హైలెట్ చేస్తూ హై బడ్జెట్లో మరో యాక్షన్ మూవీ ని తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ దర్శకుడు మరిన్ని కొత్త తరహా క్యారెక్టర్స్ ను కూడా సృష్టించబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో సంజయ్ దత్ కూడా ఉంటాడని సమాచారం. ఇక తెలుగు హీరోలపై కూడా అతను ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో లోకేష్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.