»   » భలె భలే మగాడివోయ్ కి సీక్వెల్..?

భలె భలే మగాడివోయ్ కి సీక్వెల్..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఈ రోజుల్లో", "బస్టాప్"తో అడల్ట్ మూవీస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతీ "కొత్త జంట"తో ఆ ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేశాడు కానీ, పెద్దంత సక్సెస్ కాలేదు. ఒక గట్టి ప్రయత్నం గానే "భలే భలే మొగాడివోయ్" ను అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్ టైనర్ గా మారుతీ తెరకెక్కించి. ఒక్కదెబ్బకు రెండు పిట్తలు అన్నట్టు అతు తమమీద ఉన్న బూతు ముద్రని తొలగించుకోవటమే కాదు ఎన్నాళ్ళుగానో నాని ని ఊరిస్తున్న ఒక భారీ హిట్ ని ఇచ్చాడు.

సరైన టైం లో ఇద్దరికీ సరైన బ్రేక్ తెచ్చిన సినిమా "భలే భలే మగాడివోయ్" ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత ఇటు మారుతి. అటు నాని ఇద్దరూ కూడా ఒక కొత్త పంథా లో ఇదివరకు వారు చేయని జోనర్ లోనే సినిమాలు చేస్తూ వెళుతున్నారు. మారుతి విక్టరీ వెంకటేష్ తో బాబు బంగారం చేస్తూందగా.., నాని నీలకంఠ దర్షకత్వం లో జెంటిల్ మేన్ అనే నెగెటివ్ షేడ్ ఉండే పాత్రలో కనిపించనున్నాడట అలా మారుతి చేతిలో రెండు మూడు సినిమాలు కనిపిస్తుంటే, నాని చేతిలోనూ రెండు మూడు సినిమాలు వున్నాయి.


Director Maruthi Plans Sequel for bhale bhale magadivoy

అయితే ఇద్దరికీ ఒక బ్రేక్ పాయింట్ అయిన "భలే భలే మగాడివోయ్" సినిమా కి సీక్వెల్ రూపొందే అవకాశం ఉందనే వార్తలు షికారు చేస్తున్నాయి. మరికాస్త కామెడీ డోస్ పెంచి. మొదటి సినిమాలో మిస్ అయిన యాక్షన్ టచ్ కూడా ఇచ్చే ఆలోచనలో మారుతి ఉన్నాడని అంటున్నారు. అదే నిజమైతే సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో ఇందులో కథానాయికగా ఎవరు నటిస్తారో చూడాలి.

English summary
Latest buzz is that director maruti planing for a sequel of his movie bhale bhale magadivoy with nani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu