twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Project K: ప్రభాస్ సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీతో కొత్త కార్లు.. బడా కంపెనీలతో డీల్?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పవర్ ఫుల్ సినిమా లను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను చాలా ఆసక్తిని కలిగించే విధంగా ఉంది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ Kపై కూడా అంచనాలు అయితే మామూలుగా లేవు. ఫ్యూచర్ ఫీలింగా ఒక సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు ఆలోచన విధానం కూడా చాలా హై లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అత్యాధునిక వాహనాలను కార్లను వాడేందుకు దర్శకుడు ఒక బడా కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ విశేషాలు మీకోసం..

    Recommended Video

    Prabhas Project K| AP Movie Tickets Rates| Tollywood Updates | Filmibeat Telugu
    ప్రభాస్ కోసం అలా ఆలోచిస్తున్నారు

    ప్రభాస్ కోసం అలా ఆలోచిస్తున్నారు

    ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా బిగ్ బడ్జెట్ సినిమాలను చేస్తున్న నెంబర్ వన్ హీరో ప్రభాస్ అనే చెప్పాలి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే అత్యధిక భారీ స్థాయిలో బిగ్ బడ్జెట్ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ నుంచి సరికొత్త పాన్ వరల్డ్ సినిమాలు వస్తున్నాయి. మన దర్శకులు కూడా అంతకు మించి అనేలా ప్రభాస్ కోసం కథను సిద్ధం చేస్తూ ఉండడం విశేషం.

    ప్రభాస్ కోసం అలా ఆలోచిస్తున్నారు

    ప్రభాస్ కోసం అలా ఆలోచిస్తున్నారు

    ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా బిగ్ బడ్జెట్ సినిమాలను చేస్తున్న నెంబర్ వన్ హీరో ప్రభాస్ అనే చెప్పాలి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే అత్యధిక భారీ స్థాయిలో బిగ్ బడ్జెట్ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ నుంచి సరికొత్త పాన్ వరల్డ్ సినిమాలు వస్తున్నాయి. మన దర్శకులు కూడా అంతకు మించి అనేలా ప్రభాస్ కోసం కథను సిద్ధం చేస్తూ ఉండడం విశేషం.

    500కోట్ల భారీ బడ్జెట్ తో..

    500కోట్ల భారీ బడ్జెట్ తో..

    ప్రస్తుతం ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసినా కూడా అందరి ఫోకస్ అయితే ఎక్కువగా ప్రాజెక్టు K పైనే ఉంది. అశ్వినీదత్ నిర్మాణ సారధ్యంలో దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు అయితే ప్రతి విషయంలో కూడా హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

    సినిమా కోసం హై టెక్నాలజీ వాహనాలు

    సినిమా కోసం హై టెక్నాలజీ వాహనాలు

    ఈ సినిమాను టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ క్యారెక్టర్ సినిమాలో భవిష్యత్తులోకి కూడా వెళ్ళిపోతుందని దాదాపు మూడు నాలుగు వందల ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఎలాంటి టెక్నాలజీతో వెళుతుంది అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆందుకోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రత్యేకమైన వాహనాలను కార్లను బైకులను రెడీ చేయిస్తున్నట్లు సమాచారం.

    అనవసరంగా ఖర్చు పెట్టకుండా

    అనవసరంగా ఖర్చు పెట్టకుండా

    రీసెంట్ గా నాగ్ అశ్విన్.. మహేంద్ర కంపెనీ తో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారితో చేతులు కలిపి సినిమాకు కావాల్సిన అత్యాధునిక ఫీచర్ వాహనాలను తయారు చేసుకునేందుకు ఒక డీల్ మాట్లాడకున్నట్లు సమాచారం. సాధారణంగా ఈ సినిమాకు వాహనాలు రెడీ చేయాలి అంటే చాలా బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఇతర కంపెనీలతో మాట్లాడుకుంటే.. సినిమా ద్వారా వారికి కూడా ప్రమోషన్ చేసి కథకు తగ్గట్టుగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారట.

    చర్చలు జరుపితున్న దర్శకుడు

    చర్చలు జరుపితున్న దర్శకుడు

    దర్శకుడు నాగ్ అశ్విన్ ఆనంద్ మహేంద్రతో ప్రత్యేకంగా చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు కావాల్సిన కార్లను వాహనాలను తయారుచేసి ఇవ్వగలిగితే తప్పకుండా సినిమాలో కంపెనీకి కూడా ప్రమోషన్ వచ్చే విధంగా గా లోగోలను కూడా వాడుకునే అవకాశం ఇస్తారట. ఒకవేళ డీల్ సెట్ అయితే చిత్ర నిర్మాణ సంస్థ కార్ల కోసం పెద్దగా బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా మహేంద్ర కంపెనీ వాటిని తయారు చేసి చిత్ర యూనిట్ సభ్యులకు అంద చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    director nag ashwin planing fod features cars for Prabhas project k
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X