పరశురామ్ ఫిక్స్ చేసిన నాగేశ్వర్ రావు.. నాగచైతన్యతో సరికొత్తగా!
'గీతగోవిందం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్తదనంతో కూడిన లవ్ స్టోరీ పరిచయం చేశారు డైరెక్టర్ పరశురామ్. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో మ్యాజిక్ చేయించి యూత్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ పట్టేశారు. మళ్ళీ ఇప్పుడు అదే బాటలో నాగచైతన్యతో సరికొత్తగా ప్రయత్నం చేయబోతున్నారట పరశురామ్. ఈ మేరకు ఇప్పటికే చైతూ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న ఆయన స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నారట.
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 'నాగేశ్వర్ రావు' అనే టైటిల్ ఫైనల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ పరశురామ్. చాలా వేగంగా జనంలోకి వెళ్లి, జనాల్లో ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని ఈ టైటిల్ అనుకుంటున్నారట పరశురామ్. ఇకపోతే ఈ చిత్రాన్ని కూడా ఫీల్ గుడ్ ప్రేమ కథాంశంతో తెరకెక్కించేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. లవ్ అండ్ ఎమోషన్ కలగలుపుతూ విభిన్నమైన కథనంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్.


Click it and Unblock the Notifications











