»   » నిజమైతే రాజ్ తరుణ్ ...గోల్డెన్ ఛాన్సే

నిజమైతే రాజ్ తరుణ్ ...గోల్డెన్ ఛాన్సే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు. కెరీర్ లో ఎన్నో హిట్స్ కొట్టిన ఆయన రాజ్ తరుణ్ తో ఓ చిత్రం చేయటానికి రంగం చేస్తున్నట్లు సమాచారం.

అందుతున్న సమచారం ప్రకారం ...నాగార్జున తో రాఘవేంద్రరావు అనుకున్న మైధాలిజీ సబ్జెక్టు పట్టాలు ఎక్కటానికి లేటవుతూండటంతో ..ఈ లోగా రాజ్ తరుణ్ ఓ చిత్రం చేయటానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Director Raghavendra Rao picked Raj Tarun

అయితే అది మైధలాజికల్ సబ్జెక్టు కాదని, లవ్ తో నడిచే ఫ్యామిలీ సబ్జెక్టు అని అంటున్నారు. రాఘవేంద్రరావు మార్క్ గ్లామర్ తో తెరకెక్కించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శతమానం భవతి అనే టైటిల్ ని కూడా నిర్ణయించినట్లు సమాచారం.

రీసెంట్ గా రాజ్ తరుణ్ ని పిలిపించి ఆయన స్టోరీ లైన్ చెప్పినట్లు, దానికి వెంటనే రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డేట్స్ కేటాయించటానికి సిద్దపడినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఉయ్యాల జంపాల చిత్రంతో కెరీర్ ప్రారంబించిన రాజ్ తరుణ్..స్టెప్ బై స్టెప్ కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గా వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు చిత్రం నిరాశపరిచింది.

English summary
K Raghavendra Rao is going to direct Raj Tarun with a love based family drama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu