Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిజమా :బాలకృష్ణ సినిమాకు దర్శకుడే నిర్మాతా?
హైదరాబాద్ :బాలకృష్ణ సినిమాకు డైరక్ట్ చేసే ఆఫర్ లభించటం అనేది అదృష్టం క్రింద చెప్తూంటారు. ఎందుకంటే బాలకృష్ణ ను సబ్జెక్టు తో ఒప్పించటం ఎంత కష్టమైన పనో..ఆయనకు నచ్చి దర్సకుడుగా ఎంపిక అవటం కూడా అంతే కష్టం అని చెప్తూంటారు. మరి అలాంటి ప్రాజెక్టుని నిర్మిస్తూ నిర్మాతగా మారటం కూడా ఓ గొప్ప వరమే అంటూంటారు. అయితే అలాంటి అరుదైన బంపర్ ఆఫర్ లాంటి అవకాసం శ్రీవాసుకి దక్కిందని తెలుస్తోంది. బాలకృష్ణ 99 చిత్రానికి ఆయన డైరక్టర్ కావటమే కాక...నిర్మాతగా కూడా మారుతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తూండగా కోన వెంకట్, శ్రీవాసు వర్కింగ్ పార్టనర్స్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. శ్రీవాసు తన కుమార్తె పేరున బ్యానర్ నెలకొల్పి..ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు..
నందమూరి బాలకృష్ణ 99వ చిత్రానికి స్క్రిప్ట్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లయన్ చిత్ర షూటింగ్ లో ఉండగానే తదుపరి ప్రాజెక్టుకు బాలయ్య ఓకే చెప్పారు. ఈ సినిమాకు రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ లు మాటలు అందిస్తున్నారు. లక్ష్యం వాసు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. గతవారమే ఈ కథను బాలకృష్ణ ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే లయన్ పూర్తి అయిన తరువాత బాలయ్య 99 వ చిత్రం సెట్స్ పై కి వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘డిక్టేటర్'అనే టైటిల్ ని పెట్టే అవకాసముందని తెలుస్తోంది.
ఆ మధ్యన బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే బాలయ్య తాజా చిత్రం విషయానికి వస్తే...
బాలయ్య 'లయన్' చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'లెజెండ్' లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 'లయన్' చిత్రంలో కూడా బాలయ్య యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నాడు. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. బాలయ్య 'కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
నిర్మాత మాట్లాడుతూ.. '''లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.'' అని చెప్పారు.
'లెజెండ్' తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం. గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది! సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారని చెప్తున్నారు.
బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.