RRR Release Date Postponed: రాజమౌళి సంచలన నిర్ణయం.. మరో కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో.ఎప్పుడు లేనంత భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ రిలీజ్ డేట్ దగ్గరకొస్తున్న ప్రతిసారి కూడా వాయిదా పడుతుండడం షాక్ కు గురి చేస్తోంది. అసలే రాజమౌళి ఆలస్యం చేస్తాడని అందరికి తెలిసిందే. దానికి తోడు కరోనా మరింత ఆలస్యం చేస్తోంది. ఇక ఇటీవల మరో కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

పాత్రలతోనే భారీ హైప్
మెగా నందమూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ అంచనాలు అయితే తారా స్థాయికి చేరిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇక అజయ్ దేవ్ గన్ పాత్రతో బాలీవుడ్ లో కూడా మంచి హైప్ క్రియేట్ చేశారు.

900కోట్ల బిజినెస్..
ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారం మొత్తం పూర్తయ్యింది. బాహుబలి కంటే హై రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన RRR అన్ని వైపుల నుంచి కూడా పెట్టిన పెట్టుబడికి ఈజీగా ప్రాఫిట్స్ ను అందించగలదని అనుకుంటున్నారు. సినిమా దాదాపు 900కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

అక్టోబర్ 13న అనుకుంటే..
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం చేస్తున్న సినిమా కావడం వలన అన్ని భాషల్లో కూడా ముందు నుంచే RRR సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతూ వస్తోంది. ఇక సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ మాత్రం విడడం లేదు. కరోనా వైరస్ వలన ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. అసలైతే ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు గత ఏడాది నుంచి ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు.

మరో కొత్త రిలీజ్ డేట్
ఇక సెకండ్ వేవ్ దెబ్బకు మళ్ళీ మార్పులు చేయక తప్పడం లేదు. ఇప్పుడు మరో డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. 2022 ఏప్రిల్ 28న విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది రిస్క్ చేయడం అనవసరమని అందుకే వచ్చే ఏడాది సమ్మర్ అయితే బెటర్ అని డిసైడ్ అయ్యారట. పైగా షూటింగ్ కూడా కొంత పూర్తి చేయాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం కూడా 6 నెలల సమయం అవసరం. అందుకే రిలీజ్ విషయంపై బయ్యర్లతో కూడా చర్చించి త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications