twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలికి రాజమౌళికి అందే రెమ్యూనరేషన్ ఇదే.. దిమ్మతిరగడం ఖాయం!

    ఐదేళ్లపాటు తపస్సు చేసి ఇంతటి సంచలనాత్మక సినిమాను రూపొందించిన రాజమౌళికి వచ్చిన పేరు, ప్రతిష్ఠలు పక్కన పెడితే ఆయనకు ముట్టిన పారితోషికం ఏమిటనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్నది.

    By Rajababu
    |

    భారత దేశ సినిమా చరిత్రలో బాహుబలి ది కన్‌క్లూజన్ సృష్టిస్తున్న ప్రకంపనాలు అంతా ఇంతా కాదు. బాహుబలి2 సాధిస్తున్న కలెక్షన్లు సినీ వర్గాలను నివ్వెరపాటుకు గురిచేస్తున్నాయి. ఐదేళ్లపాటు తపస్సు చేసి ఇంతటి సంచలనాత్మక సినిమాను రూపొందించిన రాజమౌళికి వచ్చిన పేరు, ప్రతిష్ఠలు పక్కన పెడితే ఆయనకు ముట్టిన పారితోషికం ఏమిటనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్నది. తాజాగా వెలుగులోకి వచ్చిన రాజమౌళి రెమ్యూనరేషన్ వివరాలు పరిశ్రమ వర్గాలను షాక్ గురిచేస్తున్నాయి.

    లాభాల్లో వాటా..

    లాభాల్లో వాటా..

    బాహుబలి1, బాహుబలి2 సినిమాలకు దర్శకత్వం వహించినందుకు గానూ లాభాల్లో మూడోవంతు ఇచ్చేలా నిర్మాతలతో ఒప్పందం జరిగిందట. అంటే బాహుబలి2 కనుక నికరంగా రూ.1000 కోట్లు ఆర్జించినట్లయితే అందులో మూడో వంతు (1/3) అనగా రూ.330 కోట్లకు పైగానే వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఐదేళ్లపాటు రాజమౌళికి అయ్యే ఖర్చు కూడా నిర్మాతలే భరించాల్సి ఉంటుంది అనే ఒప్పందం జరిగినట్టు జాతీయ ఆంగ్ల వార్తా ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది.

    భారీగా కలెక్షన్లు..

    భారీగా కలెక్షన్లు..

    బాహుబలి1 చిత్రాన్ని రూ.180 కోట్లు, బాహుబలి2 సినిమాను రూ.450 కోట్లతో తెరకెక్కించారు. బాహుబలి సినిమా రూ.650 కోట్ల వసూళ్లను సంపాదించింది. బాహుబలి చిత్రం రిలీజ్ తర్వాత భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. విడుదలకు ముందే నాలుగు భాషల్లో రూ.438 కోట్లు శాటిలైట్, ఇతర హక్కుల కింద ఆదాయం వచ్చింది. ఈ చిత్రానికి వచ్చిన లాభాల్లో నుంచి రాజమౌళి భారీగానే రెమ్యూనరేషన్ అందుకొనే అవకాశం ఉంది.

    దేశవ్యాప్తంగా జోరుగా వసూళ్లు..

    దేశవ్యాప్తంగా జోరుగా వసూళ్లు..

    ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి2 సినిమా అనూహ్యమైన కలెక్షన్లను సాధిస్తున్నది. బాలీవుడ్‌లో విడుదలై సంచలన విజయ సాధించిన చిత్రాలకు ధీటుగా బాహుబలి హిందీ వెర్షన్ భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. గత మూడు రోజుల కలెక్షన్లను ఇతర చిత్రాల్లో పోల్చితే వివరాలు ఇలా ఉన్నాయి. ఈ వివరాలను ట్రేడ్ అనలిస్టు తరుణ్ అదర్శ్ ట్వీట్ చేశారు.

    బాహుబలి దేశవ్యాప్తంగా సాధించిన మూడు రోజుల కలెక్షన్ల వివరాలు

    సుల్తాన్ రూ. 103 కోట్లు
    దంగల్ రూ.107 కోట్లు
    బాహుబలి2 128 కోట్లు

    ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళంలో

    తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో బాహుబలి భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. బాహుబలి2 సినిమా రూ.210 కోట్లు (గ్రాస్), రూ.180 కోట్లు (నెట్) కలెక్షన్లను సాధించిందని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ట్వీట్ చేశారు.

    ఏప్రిల్ 28న విడుదల..

    ఏప్రిల్ 28న విడుదల..

    రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబులి2 సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

    English summary
    Director SS Rajamouli, who has invested 5 precious years of his life, time and energy to make both Baahubali: The Beginning and Baahubali: The Conclusion, gets one third share in the profits made by both the films. Apart from that, the makers have also covered his personal expenses for all the 5 years that he was involved in making of the films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X