Just In
- 15 min ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 1 hr ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 2 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 2 hrs ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
Don't Miss!
- News
ఏపీకి గుడ్ న్యూస్.. కర్నూలు విమానాశ్రయానికి డీజీసీఏ లైసెన్స్.. మార్చి నుంచి విమాన రాకపోకలు
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Lifestyle
ఈ పరోక్ష లక్షణాలు మీకు బిడ్డ పుట్టకపోవడానికి హెచ్చరిక కావచ్చు ... జాగ్రత్త ...!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్లాన్ చేంజ్ చేసిన డైరెక్టర్ తేజ.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..
సీనియర్ డైరెక్టర్ తేజ ఒకప్పుడు లవ్ స్టోరీస్ తో ఎలాంటి విజయాలను అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే వరుస అపజయాల అనంతరం తేజ తన ట్రాక్ ను చేంజ్ చేసి నేనే రాజు నేనే మంత్రి సినిమాను చేశాడు. ఇక ఆ సినిమా హిట్ తరువాత ఫామ్ లోకి వచ్చిన తేజ వెంటనే రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లే పెట్టి పూర్తి చేయకుండానే తప్పుకోవాల్సి వచ్చింది.
బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ కోసం మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజ ఆ తరువాత నేనే చేయలేను అంటూ తప్పుకున్నాడు. ఇక వెంకటేష్ తో కూడా ఒక పవర్ఫుల్ సినిమాను లైన్ లో పెట్టినట్లే పెట్టి అపెయ్యాల్సి వచ్చింది. ఇక ఆ మధ్య సీత అనే సినిమా చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక ఫైనల్ గా గోపిచంద్, రానాలతో సినిమాలు చేస్తున్నట్లు ఎనౌన్స్ చేసిన తేజ లాక్ డౌన్ అనంతరం ముందు ఏది కుదిరితే అది చేయాలని అనుకున్నాడు.

అయితే రానా సినిమా సంగతి ఏమిటో గాని గోపీచంద్ తో చేయాల్సిన సినిమాను తేజ పక్కన పెట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక రానాతో ముందు అనుకున్న సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయినట్లు మరొక టాక్ వస్తోంది. గోపిచంద్ ను ఇండస్ట్రీకి విలన్ గా పరిచయం చేసింది తేజనే. జయం, నిజం సినిమాల్లో గోపిచంద్ విలన్ పాత్రలకు అప్పట్లో మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత హీరోగా ట్రై చేసి గోపిచంద్ ఒక ట్రాక్ లోకి వచ్చాడు. మరి తేజ సినిమాపై వస్తున్న రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.