Just In
- 8 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 8 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 9 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 9 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్రివిక్రమ్ రెండు చేతుల సంపాదన.. ఓ వైపు డైరెక్షన్ మరో వైపు స్క్రిప్ట్ రైటింగ్..
మాటల మాంత్రికుడు అని త్రివిక్రమ్ ను ఊరికే అనలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో డైలాగ్స్ ఎంతగానో ఆలోచించే విధంగా ఉంటాయి. చాలా వరకు సినిమాల రిజల్ట్ తేడా కొట్టినప్పటికి ఏదో ఒక పాయింట్ మాత్రం న్యూ ట్రెండ్ సెట్ చేయడం మాత్ర కాయం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఒక్కసారైనా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకుంటారు. ఇక అల.. వైకుంఠపురములో సక్సెస్ అనంతరం ఆయన రేంజ్ మరింత పెరిగింది. అందుకే రెండు చేతుల సంపదన కూడా పెరిగింది.

డైరెక్షన్ అనే కాకుండా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులు ఎంత మంది ఉన్నా కూడా త్రివిక్రమ్ కు మాత్రం ఎల్లప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కమర్షియల్ లోనే అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే సెట్ చేయగల ఆయన మాటలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక డైరెక్షన్ కాకుండానే త్రివిక్రమ్ ఇతర సినిమాలకు కూడా వర్క్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాతోనే న్యూ రికార్డులు
త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమాతో అభిమానులను ఒక్కసారిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత వచ్చిన ఆరవింద సమేత ఓపెనింగ్స్ బాగానే రాబట్టుకుంది గాని పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఇక ఆ తరువాత వచ్చిన అల.. వైకుంఠపురములో మాత్రం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

వేరే సినిమాలకు మాటలు రాస్తున్నాడట..
ఇక మొత్తానికి ఎన్టీఆర్ తో మరో సినిమాను చేయనున్నట్లు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు ఎలాగు పాట్నర్ గా ఉండడంతో లాభాల్లో షేర్ తీసుకోనున్నాడు. అంతే కాకుండా ఇటీవల స్క్రిప్ట్ రైటింగ్ సైడ్ కూడా త్రివిక్రమ్ దృష్టి పెడుతున్నాడు. కెరీర్ మొదట్లో వర్క్ చేసినట్లుగా వేరే సినిమాలకు స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాడు.

మొదట ఆ సినిమా కోసం మాటలు
ఒకవైపు యాక్షన్ చెబుతూనే మరొక వైపు డైలాగ్స్ అలాగే కథ చర్చల్లో స్క్రీన్ ప్లేకు సహాయం చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ త్రివిక్రమ్ చూస్తున్నాడు. ఇక మొదట పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కొశీయుమ్ సినిమాకి డైలాగ్స్ రాయనున్న త్రివిక్రమ్ ఆ సినిమాకు కోట్లల్లోనే పారితోషికం అందుకుంటున్నాడట.

త్రివిక్రమ్ కు భారీ రెమ్యునరేషన్
ఇక త్వరలో రానా దగ్గుబాటి, గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న హిరణ్యకశిప అనే పాన్ ఇండియా సినిమా కోసం కూడా మాటలు అందించనున్నాడు త్రివిక్రమ్. ఆ ప్రాజెక్టు కోసం 5కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక అల్లు అరవింద్ త్వరలో స్టార్ట్ చేయనున్న రామాయణ కోసం కూడా స్క్రీన్ ప్లేలో సహాయం చేస్తూ డైలాగ్స్ రాస్తున్న త్రివిక్రమ్ అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.