»   » 'అఖిల్‌' ఫ్లాఫ్: వివి వినాయిక్ కాంపన్షేషన్, హామీ

'అఖిల్‌' ఫ్లాఫ్: వివి వినాయిక్ కాంపన్షేషన్, హామీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొంది దీపావళి కానుకగా రిలీజ్ అయిన చిత్రం 'అఖిల్‌' . శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటం గణణీయంగా కలెక్షన్స్ డ్రాప్ అవటం మొదలెట్టి చివరకు డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ద్వారా నష్టపోయిన ఇన్విస్టర్స్, బయ్యర్స్ కు రికవరీలు ఇవ్వటం తప్పనిసరి అయ్యింది.

అందుతున్న సమచారం ప్రకారం వివి వినాయిక్ తన రెమ్యునేషన్ గా తీసుకున్న మొత్తం లోంచి కాంపన్షేషన్ గా ..నాలుగు కోట్ల రూపాయిలు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఆయన డబ్బు ని ఇవ్వటమే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ కు తదుపరి చేయబోయే చిత్రాలలో కూడా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


ట్రేడ్ లో చెప్పుకునేదాన్ని బట్టి...తొలి రోజు వచ్చిన హైప్ కు ..10 కోట్లు వరకూ ప్రపంచ వ్యాప్తంగా షేర్ రాబట్టగలిగింది. అయితే రెండో రోజు నుంచి ఊహంచని డ్రాప్ మొదలైంది. సాధారణంగా సోమవారం నుండి సినిమాకు టాక్ బాగోలేకపోతే డ్రాప్ మొదలవుతుంది.అయితే ఈ సినిమాకు తొలి రోజు మాట్నీ నుంచే చాలా వరకూ ధియోటర్స్ వద్ద జనం పలుచబటం, టాక్ చాలా స్పీడుగా స్ర్రెడ్ అవటం మైనస్ గా నిలిచింది.


Director V V Vinayak compensation?

దాంతో రెండో రోజు,మూడో రోజు కేవలం 1.5 కోట్లు మాత్రం షేర్ రాబట్టిందని తెలుస్తోంది. ఇదే డ్రాప్ కంటిన్యూ అయితే కేవలం 17-20 కోట్లు మాత్రమే వెనక్కి వస్తాయి. అయితే ఈ సినిమాని 44 కోట్లు పైచిలుకే రేట్లుకు అమ్మారని సమాచారం. దాంతో దాదాపు సగానికి సగం నష్టం ఈ సినిమా పంపిణీదారులకు మిగిలుస్తుంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Director Vinayak has given the amount of Rs 4 Cr for AKHIL move compensation.
Please Wait while comments are loading...