»   » ‘దూసుకెళ్తా’ వీరూపోట్ల నెక్స్ట్ పెద్ద హీరోతో..??

‘దూసుకెళ్తా’ వీరూపోట్ల నెక్స్ట్ పెద్ద హీరోతో..??

Posted By:
Subscribe to Filmibeat Telugu
Director Veeru Potla next with Balayya
హైదరాబాద్ : రీసెంట్ గా 'దూసుకెళ్తా' చిత్రం తో విజయం సాధించిన దర్శకుడు వీరూపోట్ల. ఆయన తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆయన నెక్ట్స్ చిత్రం బాలకృష్ణ తో చేసే అవకాసం ఉందని సమాచారం. ఈ మేరకు వీరూ ఇప్పటికే ఓ స్క్రిప్టు చెప్పి బాలకృష్ణ చేత ఒకే చేయించాడని తెలుస్తోంది. అందుకోసం మంచు ఫ్యామిలీ సాయం తీసుకున్నాడని వార్తలొస్తున్నాయి.

2014మార్చిలో ఈ కాంబినేషన్ సెట్స్‌కెళుతుందని తెలుస్తోంది. ఏదేమైనా ఇది వీరూ కెరీర్‌కి ఉపయోగపడేదే అంటున్నారు. నాగార్జున తర్వాత మరో పెద్ద హీరోతో పనిచేసే సదవకాశమిది. కాకపోతే బాలయ్య 2014 ఎన్నికల్లో టీడీపీని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రాజెక్ట్‌ కాస్త ఆలస్యం అవ్వొచ్చు అంతే. అలా కాకుండా వీరూ ప్లాన్డ్‌గా ముందుకెళతాడేమో! చూడాలి అని బాలయ్య అభిమానులు అంటున్నారు.

హిట్ కోసం బాలకృష్ణ మళ్లీ 'సింహా' డైరెక్టర్‌ బోయపాటితోనే పనిచేస్తున్నాడు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో మరోసారి జూలు విదిల్చడానికి సంసిద్ధుడవుతున్నాడు. ఇప్పటికే 'లెజెండ్‌'(ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్‌ చాలా భాగం పూర్తయింది. మరో 45 రోజుల షెడ్యూల్‌ పూర్తయితే టాకీ పూర్తయినట్టే. బ్యాలెన్స్‌ చిత్రీకరణ కోసం త్వరలోనే యూనిట్‌ వైజాగ్‌ వెళుతోంది. అక్కడినుంచి తిరిగి వస్తే ఇక పాటల చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉంటుంది.

అలాగే నిర్మాణానంతర పనులు ఏకకాలంలో పూర్తి చేయనున్నారు. దాంతో అందరిలో లెజెండ్‌ పూర్తయ్యాక బాలయ్య చేసే సినిమా ఏమిటినే ప్రశ్న రేగుతోంది. ఒకవేళ తర్వాత సినిమాకి బ్రేక్‌ వేసి ఎన్నికల కోసం పనిచేస్తాడా...లేక కొత్త సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడా... అనే డైలమాలో ఉన్నారు. అయితే లెజెండ్‌ తర్వాత వెంటనే దూసుకెళ్తా దర్శకుడు వీరూపోట్లతో సినిమా చేస్తాడని సమాచారం. ఈ చిత్రంతో వీరు పోట్ల పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోతాడని ఆశిద్దాం.

English summary
Doosukeltha & Ragada director Veeru Potla is all set to direct Balayya's next. Sources close to the later suggest that Balayya has okayed a story line and they will zero in on a producer soon to start Pre-Production. Balayya is likely to do this film after finishing ongoing Boyapati flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu