twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీకి దూరంగా దర్శకులు...ఎందుకలా?

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒకరైన వెంకష్ కు దర్శకులు దూరం అవుతుండటం ఇప్పడు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశం అయింది. రీసెంట్ గా వెంకటేష్ పలువరు దర్శకులతో కమిటైన సినిమాలన్నీ చివరి నిమిషయంలో కాన్సిల్ అయ్యాయి. ఉదాహరణకు తీసుకుంటే...తేజ, వెంకీ కామినేషన్లో 'సావిత్రి" సినిమా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే ఎలాంటి ప్రకటన లేకుండానే ఆ సినిమా రద్దయింది. వెంకీ సైలెంట్ గా బాడీగార్డు రీమేక్ కు షిప్ట్ అయ్యాడు. దర్శకుడు త్రివిక్రమ్ వెంకీతో సినిమా చేయడానికి కొన్ని నెలల పాటు స్క్రిప్టు వర్క్ చేశాడు. చివరకు ఆ ప్రాజెక్టును వదిలేసి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. దశరత్ కూడా వెంకీతో సినిమా తీయాలని భావించినా చివరకు నాగార్జునతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు.

    ఎందుకిలా జరుగుతుందంటే...వయసు పైబడుతున్న కొద్దీ వెంకీలో కన్ ఫ్యూజన్ పెరిగి పోయిందని, అందుకే సినిమాలు ఒప్పుకునే విషయంలో గంధరగోళానికి గురవుతున్నాడని. ఈ గందరగోళంలో వెంకీ కొన్ని సినిమాలు చేజార్చుకుంటుండగా, వెంకీ తీరు కారణంగా మరికొందరు దర్శకుడు సైడ్ అయిపోతున్నారనే చర్చ సాగుతుంది సినీ వర్గాల్లో. కెరియర్ చివరన ఉన్న వెంకీ తన చేయబోతున్న సినిమాల గురించి అతి జాగ్రత్త తీసుకోవడమే ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తోందని అంటున్నారు. బహుషా వరుస ప్లాపుల బాట పట్టిన వెంకీ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు అంటున్నారు. ఏది ఏమైనా బాడీగార్డు సినిమాపైనే వెంకీ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసినిమా హిట్టయితే ఆయనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయని, లేక పోతే అంతే అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

    English summary
    Veteran actor Venkatesh seems like he is caught in a dilemma of what to do and what not to, due to his age factor. Venkatesh was never in so much confusion in the past.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X