»   » పాపం శ్రీముఖికి అలా జరిగిందా.. శ్రీనువైట్ల అలా చేశాడా..

పాపం శ్రీముఖికి అలా జరిగిందా.. శ్రీనువైట్ల అలా చేశాడా..

Written By:
Subscribe to Filmibeat Telugu

టెలివిజన్ రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న శ్రీముఖి ఓ మంచి అవకాశం కోల్పోయింది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కోసం శ్రీముఖిని తీసుకొంటే ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశీలించారట. వరుణ్ తేజ్ పక్కన శ్రీముఖి మ్యాచ్ కాదని పక్కన పెట్టినట్టు సమాచారం.

శ్రీముఖిని తప్పించడానికి అదే కారణమా

శ్రీముఖిని తప్పించడానికి అదే కారణమా

శ్రీముఖిని పక్కన పెట్టడం వెనుక ఆమె హైటే కారణమని తెలుస్తున్నది. శ్రీముఖి చాలా పొట్టిగా ఉండటమే కాకుండా కాస్త బొద్దుగా కూడా కనిపిస్తుంది. మిస్టర్ హీరో వరుణ్ తేజ్ ఆరడుగుల కంటే ఎక్కువ హైటే. వారిద్దరిని కలిపి ఐటం సాంగ్ తీస్తే బాగుండదనే అభిప్రాయం వ్యక్తమవ్వడంతో శ్రీముఖిని తప్పించినట్టు సమాచారం.

బాహుబలి మోడల్ ఖారారు..

బాహుబలి మోడల్ ఖారారు..

ఈ సినిమాలో చిత్రీకరించే ప్రత్యేకమైన పాట కోసం బాహుబలిలో మనోహరి పాటలో కనిపించిన మోడల్‌ను ఖారారు చేసినట్టు తెలుస్తున్నది. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలో కథానాయికగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నది.

అవసరాలతో హాట్ హాట్‌గా

అవసరాలతో హాట్ హాట్‌గా

హంటర్ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న బాబు బాగా బిజీ అనే సినిమాలో శ్రీ ముఖి హాట్ హాట్‌గా నటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నటుడు శ్రీనివాస్ అవసరాలతో మోతాదుకు మించిన శృంగారం ఒలకబోసినట్టు ఇటీవల విడుదలైన సన్నివేశాల్లో స్పష్టమైంది. ఈ చిత్రంలో అవసరాల నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేసినట్టు సమాచారం. హంటర్‌లో చిన్నదాన నీ కోసం ఫేం మిస్తీ చక్రవర్తి, హీరోయిన్ తేజస్వీ, సుప్రియ ఆయ్సోలాతోపాటు శ్రీముఖి కూడా నటించింది.

టెలివిజన్ ప్రొగ్రామ్స్ బిజీగా

టెలివిజన్ ప్రొగ్రామ్స్ బిజీగా

ప్రస్తుతం శ్రీముఖి ఈటీవీ గ్రూప్ టెలివిజన్ ఛానెళ్లలో పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నది. తక్కవకాలంలో టెలివిజన్ రంగంలో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నది. ప్రముఖ యాంకర్లు అనసూయ, రష్మి పోటీపడుతున్నది.

ఐటెంగా కనిపించలేదు.

ఐటెంగా కనిపించలేదు.

యాంకర్‌ శ్రీముఖి ఇటీవల పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసింది. ఇప్పటివరకు వెండితెర మీద కనిపించినా చాలా పద్దతిగా కనిపించింది. అయితే గతంలో ఎన్నడూ ఐటెం పాటల్లో గానీ, శృంగార సన్నివేశాల్లో పెద్దగా కనిపించలేదు.

English summary
Srimukhi is the top anchor in Television Industry. She had very good recognisation in this arena. There is rumour that she misses opportunity beside Mega Hero Varun Tej in Mister movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu