»   » డీజేలో ఎన్‌టీఆర్, ఏఎన్నాఆర్‌కు అవమానమా? మెగాస్టార్ హైలైట్.. కమ్మ అంటూ మరో వివాదం..

డీజేలో ఎన్‌టీఆర్, ఏఎన్నాఆర్‌కు అవమానమా? మెగాస్టార్ హైలైట్.. కమ్మ అంటూ మరో వివాదం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దువ్వాడ జగన్నాథం చిత్రం రిలీజై భారీ కలెక్షన్లను రాబడుతున్నట్టు సమాచారం. దిల్ రాజు కెరీర్‌లో 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం డివైడ్ టాక్‌ను సంపాదించుకొన్నది. రొటీన్ కథను అల్లు అర్జున్ ఫెర్మార్మెన్స్, పూజా హెగ్డే గ్లామర్, రావు రమేశ్ విలనిజం, సుబ్బరాజు కామెడీ విలనిజం నిలబెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. లాంగ్ వీకెండ్ కావడంతో భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం లేకపోలేదు. విడుదలకు ముందు గుడిలో బడిలో మడిలో ఒడిలో పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బ్రహ్మణ సంఘాలు ఆ పాటలోని అభ్యంతరకరమైన పదాలను తొలగించాలని డిమాండ్ చేసిన విదితమే. రిలీజ్ తర్వాత కూడా దువ్వాడ జగన్నాథాన్ని వివాదాలు చుట్టుముట్టడం ఆగడం లేదు. ఈ సినిమాలో కమ్మ కులంపై డైరెక్ట్‌గా డైలాగ్స్ చెప్పించడంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది. ఓ వర్గం అభిమానులు దర్శక నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఓ పాటలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌లను అవమానించే రీతిలో చిత్రీకరించారనే వాదన కూడా వెలుగులోకి వచ్చింది.

డీజేలో ఇంగువ చిచ్చు.

డీజేలో ఇంగువ చిచ్చు.

దువ్వాడ జగన్నాథం చిత్రంలో పెళ్లికి సంబంధించిన ఓ సీన్ ఉంటుంది. ఆ పెళ్లికి సంబంధించిన వంటలను బ్రహ్మణులు (అల్లు అర్జున్) నడిపే అన్నపూర్ణ క్యాటరింగ్‌కు ఇస్తారు. అయితే పులిహోరలో ఇంగువ వద్దని పెళ్లి వారు గోల చేస్తున్నారని చెప్పగా.. ఇంగువ లేకపోతే పులిహోర టేస్టే ఉండదు అని అల్లు అర్జున్ అంటాడు. పెళ్లి వాళ్లను ఒప్పించడానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ కాల్ రిసీవ్ చేసిన పాత్రధారి (ఝాన్సీ) మాట్లాడుతుంది.


కమ్మలో ఆడవాళ్లదే డామినేషన్

కమ్మలో ఆడవాళ్లదే డామినేషన్

మా ఇంట్లో పెళ్లి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మాది కమ్మ కులం, వాళ్లది వేరే కులం. మాకు ఇంగువతో కూడిన భోజనం ఇష్టపడటం లేదు అని అంటుంది. బ్రహ్మణు పిల్లను చేసుకొంటున్నారు. బ్రహ్మణుల చేత వంట చేయిస్తున్నారు. బ్రహ్మణ వంట తినకపోతే బాగుండదు అని నచ్చచెప్తారు. మాటల్లో భాగంగా బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు అని అర్జున్ సెటైర్ వేస్తాడు. కమ్మవారి ఇంట్లో ఆడవాళ్లదే డామినేషన్.. మీరు చెప్తే అందరూ వింటారు అనే విధంగా స్టైలిష్ స్టార్ చెప్తాడు. దాంతో సరైనని ఝాన్సీ అంటుంది.


కమ్మ అంటూ వాడటంపై..

కమ్మ అంటూ వాడటంపై..

అయితే కమ్మ కులం అనే పదాన్ని డైరెక్ట్‌గా వాడటంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కమ్మ కులంలో ఆడవాళ్ల డామినేషన్ నడుస్తుంది అని లేవనెత్తిన పాయింట్ కొందరికి మింగుడుపడటం లేదు. తమ కులంపై అలా బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సిటీ మార్ పాట హైలైట్

సిటీ మార్ పాట హైలైట్

అలాగే దువ్వాడ జగన్నాథం చిత్రానికి సిటీ మార్ పాట హైలెట్‌గా నిలించింది. ఆ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డే దుమ్ము రేపారు. పాటకు ఈలలతో థియేటర్ దద్దరిల్లింది. ఆ పాటలో భాగంగా ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, మెగాస్టార్ అంటూ ముగ్గురు హీరోలను ఆకాశానికి ఎత్తాడు దర్శకుడు. కానీ పాటలో మహానటులను చూపిన విధానంపై కూడా ఓ వర్గం అభ్యంతరాలను లేవనెత్తుతున్నది.


మెగాస్టార్‌ను హైలైట్ చేస్తారా?

మెగాస్టార్‌ను హైలైట్ చేస్తారా?

సీటీ మార్ పాటలో ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ అంటూ అల్లు అర్జున్ అంటుండగా బ్యాక్ గ్రౌండ్‌లో ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు ప్రత్యక్షమవుతాయి. అక్కడే నందమూరి, అక్కినేని అభిమానులు ఇందేంటని ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్‌ను మధ్యలో పెద్దగా హైలెట్ చేస్తూ.. మహానటుల ఫొటోలను పక్కకు పడేశారు అని మండిపడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.English summary
Another trouble for Duvvada Jagannadham movie. Ceeti Maar Song is highlight for this movie. But fans are pointing out the NTR, ANr photo way used in the song. They questioned That the kind of treatment not fair with song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu