»   » డివైడ్ టాక్ తో ‘ఆరెంజ్’ రేంజ్ ని తగ్గించింది....

డివైడ్ టాక్ తో ‘ఆరెంజ్’ రేంజ్ ని తగ్గించింది....

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర" వంటి మోన్ స్ట్రస్ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేసినా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం అసాధ్యమని భావించి, ఆ ఎఫెక్ట్ ని కనీసం మలి చిత్రానికైనా తగ్గించేందుకు చరణ్ ప్రయోగాత్మకంగా చేసిన 'ఆరెంజ్" ప్రయత్నానికి ఊహించినట్టుగానే మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎంతగా ఇది క్లాస్ అప్పీల్ ఉన్న సినిమా అని మొదట్నుంచీ చెబుతూ వచ్చినా కానీ మాస్ ఆడియన్స్ కూడా ఈ చిత్రం నుంచి ఎంతో కొంత షేర్ ఎక్స్ పెక్ట్ చేశారు.

అయితే భాస్కర్ మాత్రం మాస్ ని పూర్తిగా ఇగ్నోర్ చేసి తన ధోరణిలో తాను సినిమా తీశాడు. ఇంతవరకు తెలుగు తెరపై చర్చకు నోచుకోని ఒక పాయింట్ ని తీసుకుని 'ఆరెంజ్" రూపొందించాడు. అయితే రిస్కీ పాయింట్ తీసుకున్న భాస్కర్ తన వాదనని కన్విన్సింగ్ గా వినిపించడంలో ఫెయిలయ్యాడు. సినిమాలో అత్యధిక భాగం వినోదం పండినా కానీ పతాక సన్నివేశాల్లో ఉన్న అస్పష్టత 'ఆరెంజ్" రేంజ్ ని తగ్గించింది.

అయినా కానీ ఈ చిత్రానికి క్లాస్ ఆడియన్స్, యంగ్ స్టర్స్ నుంచి మంచి మార్కులే పడుతున్నాయి. కొంతమంది మాత్రం ఇది పూర్తిగా వేస్ట్ ఎటెంప్ట్ అని కొట్టి పారేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెటిల్ అవడానికి, దీనికో స్లాట్ సెట్ అవడానికి కాస్త టైమ్ పడుతుంది. కాబట్టి అందాకా'ఆరెంజ్"ని పూర్తిగా తీసి పారేయలేం. అలా అని ఈ టాక్ తో పెట్టుబడిని తిరిగి రాబట్టుకోగలదనీ అనుకోలేం. 'ఆరెంజ్" చిత్రాన్ని షోల్డర్ చేసిన రామ్ చరణ్ ఇక ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద కూడా షోల్డర్ చేయాల్సి ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu