For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి దమాకాలో సెవెన్త్‌ సూపర్‌...రా.వన్‌ ఓవర్‌...!?

By Sindhu
|

ఎన్నో అంచనాలతో దీపావళి రోజున విడుదలైన 'రా.వన్', 'సెవెంత్ సెన్స్' డబ్బింగ్ సినిమాలు రెండూ బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయనే వార్తలొస్తున్నాయి. అయితే దేనిలో విషయం ఉందో తెలివైన ప్రేక్షకులు దానికే ఓటేస్తారని మరోసారి రుజువైంది. వీటిలో షారూక్ నిర్మించిన 'రా.వన్' అయితే మరీనూ..! సుమారు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో కొత్తదనం ఏమీ లేదని అంటున్నారు. మన దేశంలోనే కాకుండా న్యూయార్క్, లండన్ వంటి నగరాలలో కూడా ఈ సినిమా చూసిన వాళ్లు ఎంతో నిరుత్సాహపడ్డారు. ఆమధ్య వచ్చిన శంకర్ 'రోబో' సినిమాని అనుకరించినట్టుగానే ఈ సినిమా వుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రివ్యూలు కూడా చాలా దారుణంగా వున్నాయి. 'రా.వన్' లో అసలు 'విషయం' లేదంటూ ఫిలిం క్రిటిక్స్ రాస్తున్న రివ్యూలు షారుక్ కి కోపం తెప్పిస్తున్నాయట.!

ఇక సూర్య హీరోగా మురగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన 'సెవన్త్‌ సెన్స్‌" భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించగా సాంకేతికంగా, కమర్షియల్‌గా మంచి మార్కులే వేయించుకుంది. దానికితోడు సూర్య, శృతిహాసన్‌ల జంట ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఓవరాల్‌గా సెవన్త్‌ సెన్స్‌ సేఫ్‌ ప్రాజెక్ట్‌గా నిలచి బయ్యర్లకు లాభాల పంటనార్జించే దిశగా అడుగులు వేస్తోంది.

ఇక బాలీవుడ్‌ బాద్‌షా నటించిన రూ.170 కోట్ల బడ్జెట్‌గా చెప్పుకున్న 'రా..వన్‌" చిత్రాన్ని అంతా ఓ వీడియో గేమ్‌లానే భావిస్తున్నారు. చిత్రం కథాంశం కూడా వీడియోగేమ్‌ లో ఉండే విలన్‌ బయట ప్రపంచానికి వచ్చి హాని తలపెడుతుంటే హీరో ఆ విలన్‌ ని అంతమొందించే సిల్లీ పాయింట్‌తో చిత్ర కథ, స్క్రీన్‌ ప్లే నడపడంతో కొంతమంది ప్రేక్షకులకు రుచించడంలేదని తెలుస్తోంది. హాలీవుడ్‌ స్థాయిలో ఖర్చుపెట్టేటప్పుడు అందులో ఉండే కథ, కథనం కూడా అదే రేంజ్‌లో ఉంటే బాగుండేది. ఖర్చు విషయంలో కోట్లకు కోట్లు ఖర్చుపెట్టేటప్పుడు కనీసం నిర్మాణాత్మక కథ ఉండాలనే ప్రాధమిక విషయాలను మర్చిపోవడం వల్లే సినిమాలకు నష్టం చేకూరుతోంది.

సినిమాలలో విషయం తక్కువ ఉన్నా పోనీ షారూక్‌ తన హవాతో బయటపడేస్తాడనే భరోసా కూడా లేదు. ఒకప్పటి బాలీవుడ్‌ బాద్‌ షాకు ఇప్పుడు చాలా ఎక్కువగా గ్యాప్‌ రావడం పెద్ద మైనస్‌ కింద మారింది. ఇక ఈ చిత్రం వసూళ్లు ఏం రేంజ్‌లో ఉంటాయనేది మరో వారం రోజులు గడిస్తేగానీ చెప్పలేని పరిస్థితి. తొలిరోజు దీపావళి కావడంతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన 3,500 సెంటర్ల నుంచి దాదాపు రూ.22 కోట్లు వసూళ్లు చేసింది. అయితే ఈ కలెక్షన్లు కంటిన్యూ అవుతాయా అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ పిల్లలు ఆడుకునే వీడియో గేమ్‌ లానే భావిస్తే ఇక సినిమా కలెక్షన్లు పడిపోవడం ఖాయం అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు.

English summary
There was no Tollywood 'dhamaka' on Diwali day. Telugu film producers shied away from releasing any movie for the festival like they would want to but dubbed films played havoc with their plans. With different sections of the Telugu film industry pulling in different directions in so far as their stand on dubbed films is concerned, confusion is reigning supreme.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more