»   » రైటర్ కోన వెంకట్ లో కొత్త కోణం విలన్

రైటర్ కోన వెంకట్ లో కొత్త కోణం విలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ఇప్పుడు స్టార్ రైటర్ ఎవరూ అంటే కోన వెంకట్ అని కళ్ళు మూసుకు చెప్పవచ్చు. అతను ఇప్పుడు విలన్ గా మారుతున్నారు.అయితే నిజ జీవితంలో కాదు వెండి తెరపై.రామ్ హీరోగా ప్రారంభం అయిన ఎందుకంటే ..ప్రేమంట చిత్రంలో అతను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. కరుణాకరన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రారంభం రీసెంట్ గా జరిగింది.ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ చేసిన కోనా ని దర్శకుడు ఈ పాత్ర మీరు చేస్తే పండుతుందని పట్టుబట్టడంతో ఒప్పుకున్నట్లు సమాచారం.

తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం లవ్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు. ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, రిషి, సాయాజీషిండే, నాగినీడు, సత్యకృష్ణన్, మేల్కోటే, సుమన్‌శెట్టి, జెమిని విజయ్, కోనా వెంకట్ కీలక పాత్రధారులు. మాటలు: కోనా వెంకట్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, కళ: ఎ.ఎస్.ప్రకాష్, కెమెరా: ఐ.ఆండ్రూ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, స్టంట్స్: పీటర్ హెయిన్స్, సమర్పణ: పి.కృష్ణచైతన్య, నిర్మాత: స్రవంతి రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్

English summary
writer Kona Venkat and he is all set to make his debut into acting with the film ‘Endukante..Premanta’ starring Ram and Tamannah. The interesting bit is he is donning the role of a villain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu