»   » మొదటిరోజే మొదలైంది: 'అ..ఆ' పైరసీ చేసి,ఫేస్ బుక్ లో పెట్టారు

మొదటిరోజే మొదలైంది: 'అ..ఆ' పైరసీ చేసి,ఫేస్ బుక్ లో పెట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలుతో తెరకెక్కిన సినిమా 'అ...ఆ'. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం గ్రాండ్‌గా విడుదలయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ మార్క్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సంతోషంలో టీమ్ ఉండగానే పైరసీ రూపంలో తలనొప్పి ఎదురైందని తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం..నిన్న ఉదయమే మొబైల్ లో ఈ చిత్రాన్ని తీసి, ఫేస్ బుక్ లో అశోక్ రెడ్డి అనే అతను అప్ లోడ్ చేసారు. అయితే అభిమానులు కొందరు ఈ విషయం గమనించి, అ..ఆ టీమ్ కు ఈ విషయం తెలియచేసారు.

వెంటనే ఈ విషయం నిర్మాతలు దృష్టికి వెళ్లటంతో వారు వెంటనే ఫేస్ బుక్ మేనేజ్ మెంట్ తో మాట్లాడి , ఆ వీడియోని తొలిగించేసారు. అంతేకాక ఆ యూజర్ ఎక్కౌంట్ ని డిలేట్ చేసారు. ఇప్పుడు ఆ వీడియోని అప్ లోడ్ చేసిన వారిని పట్టుకుని కేసుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Face book deletes A..Aa Pirated Copy

ఇక చిత్రం తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం...ఆంధ్రా,సీడెడ్ లలో స్లోగా ఉంది. కానీ నైజాం లో మాత్రం దాదాపు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఇక్కడ తెలంగాణా ఆవిర్బావ దినోత్సవం శెలవు కలిసి వచ్చింది.

అలాగే సినిమా ఎ,మల్టిఫ్లెక్స్ లలో బాగా నడిచేటట్లు ఉందని, బి,సి సెంటర్లు కొద్దిగా కష్టమే అని చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా నష్టపోయేదమి ఉండదని, ఈ వీకెండ్ లో ఆంధ్రా సైడ్ కూడా కలెక్షన్స్ పికప్ అవుతాయని బావిస్తున్నారు.

అలాగే మరో ప్రక్క ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు వినిపిస్తోంది. జీ తెలుగు ఛానల్ దాదాపు 6.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ సినిమా ప్రసార హక్కుల్ని సొంతం చేసుకుందట. నితిన్ నటించిన సినిమాలకు ఇంత మొత్తంలో శాటిలైట్ ధర పలకడం ఇదే తొలిసారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

English summary
A..Aa movie has become the victim of piracy devil. As per reports the film pirated video was uploaded to facebook by an unknown user.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu