»   »  ఎన్టీఆర్ సినిమాలో ఇంకో మళయాళ హీరో

ఎన్టీఆర్ సినిమాలో ఇంకో మళయాళ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరక్షన్ లో రెడీ అవుతున్న సినిమా జనతా గ్యారేజ్ (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు). నిన్నా కాక మెన్న ఈ సినిమా కీలకపాత్రకు మెహన్ లాల్ ని తీసుకున్నారు. దీనికోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నారు లాల్.

ఇప్పుడు కేరళనుండి మరో యంగ్ హీరో తెలుగు సినిమాల అయిన జనతా గ్యారేజ్ లో నటించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ సినిమాలో ఇతని క్యారక్టర్ చాలా క్రూషియల్ గా ఉండే అవకాశం వుందని తెలుస్తోంది. అతను మరెవరో కాదు కేరళా స్టార్ హీరో అయిన ఫహాద్ ఫాజిల్.

Fahaad Fazil in NTR's Janata Garaje?

ఈ సినిమా ఫిబ్రవరి మెదటివారంలో మెదలయ్యే అవకాశం వుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపిస్తారని, ఇందులో మెకానిక్ గా ఉండబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా పాటలు మంచి జోరుగా అభిమానుల చెవుల్లో మారుమెగుతున్నాయి. జనవరి 13న విడుదలవుతున్న ఈ సినిమా పై అంచానాలు బాగానే ఉన్నాయి. బాబయ్ తో పోటీగా వస్తున్న ఈ సినిమా ఏ రేంజిలో సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.

English summary
Fahaad Fazil is right now getting to play a crucial role in NTR's film Janata Garaje.
Please Wait while comments are loading...