పుష్ప కోసం కొత్త హోం వర్క్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ క్లియర్!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మార్కెట్ పెంచుకునేందుకు గాను ఇతర భాషల నటులను కూడా సినిమాలో తీసుకున్నారు. అందులో భాగంగానే మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న ఫహాద్ ఫాజిల్ ను ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర కోసం ఎంపిక చేశారు. జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో ఆయన ఒక అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర కోసం తరుణ్ చేత డబ్బింగ్ చెప్పిస్తారు అని ప్రచారం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆహాలో విడుదలైన అనుకోని అతిధి సినిమాలో ఫహద్ ఫాజిల్ పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పడంతో ఈ సినిమా కోసం కూడా ఆయననే సంప్రదిస్తున్నారు అనే ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు. ఎందుకంటే తరుణ్ వాయిస్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఒకవేళ ఫహద్ పాత్రకు తరుణ్ చేత డబ్బింగ్ చెబితే ఆ పాత్రల్లో తరుణ్ కనిపిస్తాడు కానీ విలన్ పాత్రలో ఊహించుకున్నంత బేస్ కనిపించకపోవచ్చు అని టెన్షన్ పడ్డారు.

అదే జరిగితే మంచి పవర్ఫుల్ అని భావిస్తున్న ఫహాద్ ఫాజిల్ పాత్ర తేలి పోయే అవకాశం ఉండేది. ఈ విషయంలో కాస్త టెన్షన్ పడ్డ బన్నీ ఫ్యాన్స్ అందరికీ ఊరట కలిగించే న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఫహాద్ ఫాజిల్ ఈ లాక్ డౌన్ సమయంలో చిత్తూరు యాస మీద పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. తెలుగులో మరీ ముఖ్యంగా చిత్తూరు యాసను బోధించడానికి సుకుమార్ ఆయన కోసం ఒక ప్రత్యేక ట్యూటర్ ను నియమించాడట. జూమ్ కాల్స్ ద్వారా ఆయన తెలుగు నేర్చుకుంటున్నాడు అని తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు.


Click it and Unblock the Notifications











