»   » శ్రీరామ రాజ్యం...అయ్యో రామ అనిపించదు కదా?

శ్రీరామ రాజ్యం...అయ్యో రామ అనిపించదు కదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలయ్య రాముడి పాత్రలో బాపు దర్శకత్వంలో 'శ్రీరామ రాజ్యం" అనే పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్న ఎన్టీఆర్ ను పోలిన రాముడి పాత్రలో బాలయ్య అభిమానులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ సినిమాపై అభిమానులు ఓ వైపు సంతోషం వ్యక్తం చేస్తూనే...మరో వైపు ఆందోళన కూడా చెందుతున్నారు. ఇందుకు కారణంగా బాలయ్య హీరోగా గతంలో వచ్చిన బక్తిరస చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టడమే.

బాలయ్య హీరోగా అప్పట్లో వచ్చిన శ్రీకృష్టార్జున విజయం, పాండు రంగడు సినిమాలు ప్లాపులుగా నిలిచి నిరాశ పరిచాయి. ఈ రెండు సినిమాలు సింగీతం శ్రీనివాస్, రంఘవేంద్రరావు లాంటి పెద్ద డైరెక్టర్ల చేతిలో నుంచి వచ్చినవే. ఈ సినిమాలు పరాజయం పాలవడానికి డైరెక్షన్ లోపమా? లేక బాలయ్య ఆ పాత్రలకు సెట్ కాలేదా? అనంటే రెండు రకాలుగా మిక్స్ టాక్ వినిపిస్తోంది.

మళ్లీ చాలా రోజుల తర్వాత బాలయ్య మళ్లీ రాముడి అవతారంలో ప్రక్షకుల ముందుకు వస్తున్నాడు. తండ్రి ఎన్టీఆర్ వారసత్వంగా ఇందులో తను చేస్తున్న పాత్రను చాలా ప్రతిష్టాత్మకంగా తసుకున్నాడు బాలయ్య. ఈ నేపథ్యంలో సినిమా సినిమా ప్లాపయితే బాలయ్య బ్యాడ్ నేమ్ తప్పదు. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ కావడం మాట అటుంచి....అయ్యో రామ అనే విధంగా మాత్రం ఉండకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

English summary
Fans feel tension on Balakrishna’s up coming movie Srirama Rajyam. Why because his past movies has been failed on box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu