»   » అల్లు అర్జున్ సరసన మిస్ ఇండియా!?

అల్లు అర్జున్ సరసన మిస్ ఇండియా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ సరసన మిస్ ఇండియా-2009(ఫాంటలూమ్స్ ఫెమీనాప్రెష్ పేస్)గా ఎంపికైన దీక్షా సేథ్ చేయనుంది.'గమ్యం' ఫేమ్ క్రిష్ ద్వితీయ ప్రయత్నంగా చేస్తున్న మల్టీస్టారర్ 'వేదం'లో ఆమెకీ అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మాస్ ఏరియా కుర్రాడిగా ఓ డబ్బున్న అమ్మాయి వెనకపడుతూ ఆమె దగ్గర తాను రిచ్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఆ అమ్మాయిగా మొదట హన్సికను అనుకున్నారు. అయితే ఆమె రెమ్యునేషన్ మరీ ఎక్కువ చెప్పటంతో ఆమెను ప్రక్కన పెట్టారు. దాంతో ఆ అవకాశం దీక్షా సేధ్ కి వచ్చింది. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో మంచు మనోజ్ రాక్ స్టార్ గా చేస్తున్నారు. అలాగే అనూష్క ఈ చిత్రంలో వేశ్యగా డిఫెరెంట్ పాత్రను చేయనుంది. సత్య ఫేమ్ మనోజ్ బాజ్ పేయి మరో ముఖ్యమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. శోభ యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవికి రిలీజ్ అవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu