»   » రియల్ లైఫ్‌లో ఆ దురలవాటున్న హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

రియల్ లైఫ్‌లో ఆ దురలవాటున్న హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో హీరో హీరోయిన్లు పొగతాగే సన్నివేశాలు మనం చూసే ఉంటాం. సినిమా స్టోరీ, పాత్ర తీరును బట్టి తెరపై ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. అయితే కొందరు హీరోయిన్లకు నిజ జీవితంలోనూ స్మోకింగ్ అలవాటు ఉంది. అందులో కొందరిది దమ్ము కొట్టందే రోజు గడవని పరిస్థితి. పలువురు స్టార్ హీరోయిన్లు సైతం ఈ లిస్టులో ఉన్నారు.

అయితే ఇందులో చాలా మంది సరదాగా ప్రారంభించి క్రమ క్రమంగా పొగత్రాగడానికి బానిసలైన వారే. ఇక సినిమా పరిశ్రమ అంటేనే ఒత్తిడితో కూడుకున్న లైఫ్ స్టైల్ ఉంటుంది. దీంతో సినిమా సెట్లో సైతం సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేహీరోయిన్ల సంఖ్య కూడా ఎక్కువే. ఫిల్మ్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం స్మోకింగ్ అలవాటు ఉన్న హీరోయిన్ల వివరాలు స్లైడ్ షోలో....

రాణి ముఖర్జీ

రాణి ముఖర్జీ


సిగరెట్ తాగే అలవాటు ఉన్న హీరోయిన్లలో రాణి ముఖర్జీ ఒకరు. పొద్దున్నే సిగరెట్ వెలిగించనిదే ఆమెకు రోజు మొదలు కాదట. సిగరెట్ మానేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె వల్ల కావడం లేదట.

సుస్మితా సేన్

సుస్మితా సేన్


మాజీ మిస్ వరల్డ్ సుస్మితా సేన్ కు కూడా స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. పలు సందర్భాల్లో ఆమె పబ్లిక్ ప్లేసుల్లో సిగరెట్ తాగుతూ ఫోటోలకు కెమెరాలకు చిక్కారు.

కంగనా రనౌత్

కంగనా రనౌత్


బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తెరపై నటించిన చాలా పాత్రల్లో స్మోకింగ్ చేస్తూ కనిపించింది. ఫ్యాషన్, తను వెడ్స్ మను, గ్యాంగ్‌స్టర్ లాంటి చిత్రాల్లో ఆమె స్మోక్ చేస్తూ కనిపించారు. వాస్తవం ఏమిటంటే ఆమె నిజ జీవితంలో చైన్ స్మోకర్.

కొంకనా సేన్

కొంకనా సేన్


మరో బాలవుడ్ నటి కొంకనా సేన్ కూడా రియల్ లైప్‌లో చైన్ స్మోకర్. గర్భం దాల్చినపుడు స్మోకింగ్‌కు దూరంగా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మనీషా కొయిరాల

మనీషా కొయిరాల


ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మనీషా కొయిరాలకు మద్యం అలవాటుతో పాటు స్మోకింగ్ అలవాటు కూడా ఉంది.

నమిత

నమిత


దక్షిణాది భామ నమితకు కూడా నిజ జీవితంలో స్మోకింగ్ అలవాటు ఉందని, ఆమె స్మోకింగ్ వల్ల సెట్స్‌లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారనే వార్త అప్పట్లో చర్చనీయాంశం అయింది.

English summary
We have witnessed a number of actresses smoking on screen but there are many mainstream actresses who have failed to quit smoking in real lives too.
Please Wait while comments are loading...