»   » అఖిల్ ది వింత సమస్య...పరిష్కారం ఏది?

అఖిల్ ది వింత సమస్య...పరిష్కారం ఏది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అఖిల్ తదుపరి చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేయబోతున్నారు అన్నది గత కొద్ది రోజులుగా మీడియాలో నలుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఇఫ్పటివరకూ చాలా మంది దర్శకులు పేర్లు వినపడ్డా ఏదీ ఖరారు కాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ భారి డిజాస్టర్ తర్వాత, అక్కినేని వారసుడు అఖిల్ తన రెండో సినిమాకి రెడీగానే ఉన్నా, డైరక్టర్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది.

అఖిల్ చేద్దామనుకున్న డైరక్టర్స్ అఖిల్ కు దొరకటం లేదు. అలాగే అఖిల్ తో చేద్దామనకున్న దర్శకులకు అఖిల్ అందటం లేదు. దాంతో సమస్య వచ్చి పడింది. ఎలాగైనా తదుపరి చిత్రం క్రేజ్ తెచ్చి పెద్ద హిట్ కొట్టాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం దర్శకుల వేట సాగిస్తున్నారు.

Finding director for Akhil's next film?

బిజీగా గడుపుతున్న డైరక్టర్లు త్రివిక్రమ్, సుకుమార్, బోయపాటి మరియు కొరటాల శివ. వీళ్ళకి చేస్తున్న సినిమా తర్వాత సినిమాలన్ని పెద్ద హీరోలతో ఉండటంతో అఖిల్ కి దొరకలేదు. పోనిలే అనుకుని సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో సినిమా తీసే డైరక్టర్స్ కరుణాకరణ్, దేవా కట్టా, శేఖర్ ఖమ్ముల లాంటి వాళ్లు ఫ్లాపులతో బాధపడుతున్నారు.

కొంతలో కొంత మెరుగ్గా పూరి కనిపిస్తున్నాడు. కాని అంత ఖచ్చితంగా చెప్పలేం. అనుకోకుండా ఏదైనా జరిగితే లింగుస్వామి, మణిరత్నం లాంటి దర్శకులు దోరకవచ్చు. చాలా విషయాలను పరిశీలించగా, లోఫర్ రిజల్ట్ ని బట్టి అదారపడి ఉందని చెప్పవచ్చు, హిట్ అయితే పూరితో కమిట్ అయ్యే అవకాశం ఉంది.

English summary
Akkineni Akhil is now getting ready to do another film. But, the problem is who should direct the film.
Please Wait while comments are loading...