For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హ్యాపీ న్యూస్: 'గోపాల గోపాల' ఫస్ట్‌లుక్‌ విడుదల తేదీ

  By Srikanya
  |

  హైదరాబాద్ :పవన్‌కల్యాణ్ తాజా చిత్రం 'గోపాల గోపాల'కు సంబంధించి ఓ విషయం ఇప్పుడు అభిమానులను ఆనందపరుస్తోంది. చిత్రం దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తికావడంతో ఫస్ట్‌లుక్‌ని నవంబర్‌ 28న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలో షూటింగ్‌ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌లో నిమగ్నంకావాలని ప్లాన్ చేసినట్టు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నవంబర్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, డిసెంబర్ థర్డ్ వీక్‌లో ఆడియోకి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాని సంక్రాంతికి థియేటర్లలోకి రప్పించనున్నారు.

  వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌, నటిస్తున్న సినిమా ‘గోపాల గోపాల'. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌ ఇది. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  చిత్రం కథ విషయానికి వస్తే..

  First Look of GopalaGopala expected to be out on 28th Nov.

  దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

  సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం. డిసెంబర్‌లో పాటలను ఆవిష్కరిస్తాం'' అని తెలిపారు.

  శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్ర్కీన్‌ప్లేను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.

  బిజినెస్ విషయానికి వస్తే...

  పవన్‌కళ్యాణ్‌కు నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్‌ అంతాఇంతాకాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బద్దలు కొడుతుంటాయి. 'గబ్బర్‌సింగ్‌' అక్కడ 17 కోట్లు వసూలు చేసిరికార్డు క్రియేట్‌ చేస్తే, తర్వాత వచ్చిన 'అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్‌ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'గోపాల గోపాలకి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందని విశ్వసనీయ సమాచారం.

  ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం...'గోపాల గోపాల నైజాం రైట్స్‌ 14 కోట్లకు అమ్ముడ య్యాయి.ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కేవలం థియేటర్స్‌ వరకు 55 కోట్లు చేసిందట. దీంతో నిర్మాత సురేష్‌బాబు, శరత్‌మరార్‌లు దాదాపు 20 కోట్ల వరకు టేబుల్‌ ప్రాఫిట్‌ లబ్దిపొందుతున్నారని టాక్‌. పవన్‌కళ్యాణ్‌ గత చిత్రం 'అత్తారింటికి దారేదికన్నా ప్రొడక్షన్‌ కాస్ట్‌ చాలా తక్కువ కావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశమని అంటున్నారు.

  అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు

  English summary
  Pawan Kalyan and Venkatesh’s forthcoming romantic and comedy movie ‘Gopala Gopala’ shooting is progressing at full speed. The latest update is that the first look poster of this movie will be release on 28th November.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X