»   » ప్రమోషన్ కు ఫ్లాఫ్ హీరో నే దొరికాడా?

ప్రమోషన్ కు ఫ్లాఫ్ హీరో నే దొరికాడా?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: వేరే హీరోతో తమ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పించి,ప్రమోషన్ చేసుకోవటం ప్రస్తుతం ట్రెండ్. చిన్నా,పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలు ఈ సంప్రదాయన్ని పాటిస్తూ వస్తున్నాయి. అయితే సాధారణంగా ఈ వాయిస్ ఓవర్ చెప్పించే హీరోలను కాస్త మార్కెట్ లో క్రేజ్ ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు. ఎందుకంటే ఆ హీరో చేత వాయిస్ ఓవర్ చెప్పించటం ద్వారా సదరు హీరో ఫ్యాన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసే వీలుంటుంది. ఈ నేపధ్యంలో వైవియస్ చౌదరి తాజా చిత్రానికి రామ్ వంటి ఫ్లాఫ్ ల్లో ఉన్న హీరో చేత చెప్పించటం ఏం ఉపయోగం అంటున్నారు.

  సాయిధరమ్‌తేజ్‌ హీరోగా రూపొందిన చిత్రం 'రేయ్‌'. శ్రద్ధా దాస్‌, సయామీ ఖేర్‌ హీరోయిన్స్. వైవీఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాకి రామ్‌ నేపథ్య గళాన్ని అందించారు. వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలకు నేపథ్య గళం కీలకం. దీనికి రామ్‌ గాత్రమైతే బాగుంటుందని చెప్పించాం. చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము''అన్నారు.

  ఈ సినిమాకు మెగా క్యాంప్ హీరోలు ఎవరిచేత అయినా వాయిస్ ఓవర్ చెప్పిస్తే బాగుండేది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ గానీ, అల్లు అర్జున్ గానీ అయితే ఖచ్చితంగా ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చేదని అంటున్నారు. రామ్ తను రూపొందించిన దేవదాసు తో ఎంట్రీ ఇవ్వడంతో అతన్నే ఎంచుకున్నాడని అంటున్నారు. అలాగే రామ్ కు, సాయి ధరమ్ తేజ కు మధ్య మంచి స్నేహం ఉండటం కూడా ఈ వాయిస్ ఓవర్ కు కారణం అయ్యిండవచ్చు అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

  Flop Hero Ram does voiceover for YVS's Rey

  వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

  ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

  దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్ చౌదరి సాయిధరమ్ తేజతో ఎటువంటి హిట్ ఇస్తారో చూడాలి. చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

  English summary
  
 "For some key scenes in the film, a voiceover narration is needed. So when Ram came over to launch the theatrical trailer recently, I asked him if he would agree to do. He readily agreed. We recorded the voice and it came out well. I thank Ram for his help," said YVS Chowdhary.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more