»   » బాలకృష్ణ సింహా చిత్రంపై ఫన్నీ ఎస్.ఎమ్.ఎస్

బాలకృష్ణ సింహా చిత్రంపై ఫన్నీ ఎస్.ఎమ్.ఎస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ నెలాఖురున విడుదల కానున్న బాలకృష్ణ తాజా చిత్రం సింహాపై ఓ ఫన్నీ ఎస్.ఎమ్.ఎస్ రూపొంది అందరి సెల్ లకూ వస్తోంది. ఆ ఎస్.ఎమ్.ఎస్ లో ఏమని రాసి ఉందంటే...బ్రేకింగ్ న్యూస్...108 సర్వీస్ ఏప్రియల్ 30 వ తేదిన అందుబాటులో ఉండదు. ఎందుకంటే అన్ని 108 సర్వీస్ లన్నీ బాలకృష్ణ సింహా ధియోటర్స్ వద్ద మోహరించి ఉంటాయి. కాబట్టి ఈ ఎస్.ఎమ్.ఎస్ ని దయచేసి మరొకరికి పాస్ చేయండని ఇంగ్లీషులో రాసి ఉంది. ఈ ఎస్.ఎమ్.ఎస్. కేవలం ఆంధ్రాలోనే కాక అమెరికాలోని తెలుగు వారి మొబైల్స్ కూడా చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. ఇక ఈ ఎస్.ఎమ్.ఎస్ సంగతి ప్రక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత పాజిటివ్ టాక్ తో సింహా రిలీజ్ అవుతోంది. అలాగే పబ్లిసిటీ బాగుండటం పాటలు ప్రజల్లోకి వెళ్ళటం అబిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. వరస అపజయాలతో ఉన్న బాలయ్య ఈ చిత్రంతో తిరిగి మళ్ళీ పుంజుకుంటారని భావిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ నటిస్తున్నారు. సెకెండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రానికి హైలెట్ అయి నిలుస్తుందంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu