»   » నిర్మాత నల్లమలుపు బుజ్జి నెక్ట్స్ చిత్రం ఆ హీరోతో

నిర్మాత నల్లమలుపు బుజ్జి నెక్ట్స్ చిత్రం ఆ హీరోతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ హిట్ చిత్రాల నిర్మాత నల్లమలపు బుజ్జి త్వరలో బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా ఓ చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మానందంతో అశోసియేట్ అయ్యి ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ద్వారా దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ క్లోజ్ అశోసియేట్ శేఖర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం రొమాంటిక్ ధ్రిల్లర్ గా ఉండనుందని సమాచారం. ఇక గౌతమ్ తొలి చిత్రం పల్లకీలో పెళ్ళికూతురు భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. రెండో చిత్రం వారెవా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే నల్లమలుపు బుజ్జి ప్రస్తుతం రానా హీరోగా, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నేనూ...నా రాక్షసి చిత్రం నిర్మిస్తున్నారు. ఆయన గతంలో ఆది, చెన్నకేశవ రెడ్డి, లక్ష్యం, లక్ష్మి, చింతకాయల రవి వంటి హిట్ చిత్రాలను నిర్మించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu