»   »  కమల్ హాసన్, గౌతమి బ్రేకప్: శ్రుతి హాసన్ కారణమా...

కమల్ హాసన్, గౌతమి బ్రేకప్: శ్రుతి హాసన్ కారణమా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్ హాసన్, గౌతమి బంధం తెగిపోవడానికి శ్రుతిహాసన్ కారణమనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో పాటు మరో కారణం కూడా ఉందని అంటున్నారు. గౌతమి రాజకీయ ఆరంగేట్రం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు వివాహం మీద నమ్మకం లేకపోవడం వల్లనే సహజీవనం చేయడానికి గౌతమి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇరువురు కలిసి ఎక్కడికైనా వెళ్లినప్పుడు భార్యాభర్తలుగా పరిచయం చేసుకునేవారు కాదని అంటున్నారు. గత కొద్ది కాలంగా గౌతమి తన కూతురు సుబ్బలక్ష్మితో ఉంటున్నట్లు తెలుస్తోంది. శ్రుతిహాసన్‌తో విభేదాల కారణంగా కమల్ హాసన్‌తో విడిపోవాలని ఆమె అనుకున్నట్లు పరోక్షంగా ప్రస్తావించిందని అంటున్నారు.

తన కూతురిని చూసుకోవాల్సిన అవసరం ఉందని గౌతమి మంగళవారంనాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దాన్ని బట్టి సుబ్బులక్ష్మితో ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విడిపోవాలని కమల్ హాసన్, గౌతమి కలిసే తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు.

 శ్రుతిహాసన్‌తో వ్యవహారం ఇదీ...

శ్రుతిహాసన్‌తో వ్యవహారం ఇదీ...

పదమూడేళ్ల పాటు ఏళ్ల పాటు సాగిన కమల్ హాసన్ సహజీవనానికి బ్రేక్ పడడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘శభాష్‌నాయుడు' సినిమా సమయంలో గౌతమి సూచించిన కాస్టూమ్స్‌పై కమల్ పెద్ద కూతురు శృతిహాసన్ అభ్యంతరం చెప్పిందని అంటున్నారు. అప్పుడు మొదలైన చిన్న వివాదంతో విభేదాలు పెరిగినట్లు ప్రచారం సాగుతోంది.

 వెంకయ్య నాయుడితో భేటీ

వెంకయ్య నాయుడితో భేటీ

గౌతమి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. రాజకీయాల్లోకి ప్రవేశించాలని గౌతమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని గౌతమి కలిశారు. ముందు నుంచి పలు సమాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న గౌతమి త్వరలోనే రాజగకీయాల్లో ప్రవేశిస్తారని అంటున్నారు. అది కమల్ హాసన్‌రు ఎలాంటి నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

 శ్రుతి హాసన్ ఇలా ముంబైలోనే..

శ్రుతి హాసన్ ఇలా ముంబైలోనే..

శ్రుతిహాసన్ కమల్ హాసన్‌కు సారికతో పుట్టిన కూతురు. శ్రుతిహాసన్ ముంబైలోనే ఉంటూ అటు బాలీవుడ్‌లోనూ ఇటు తెలుగులోనూ నటిస్తూ వస్తున్నారు. చెన్నై వచ్చినప్పుడు శ్రుతి హాసన్ కమల్ హాసన్‌ను మాత్రమే కలిసి వెళ్తుండేవారని సమాచారం. దీంతో శ్రుతిహాసన్‌కు, గౌతమికి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చినట్లు సమాచారం.

 కమల్ హాసన్ ప్రతిస్పందన ఇలా...

కమల్ హాసన్ ప్రతిస్పందన ఇలా...

గౌతమి చేసిన ప్రకటనపై కమల్ హాసన్ ప్రతిస్పందించడానికి నిరాకరించినట్లు సమాచారం. ఆమె చేసిన ప్రకటన కాబట్టి తాను ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. గౌతమి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆమెనే వెల్లడిస్తారని ఆయన అంటున్నట్లు చెబుతున్నారు

బ్లాగులో గౌతమి ప్రకటన...

బ్లాగులో గౌతమి ప్రకటన...

లైఫ్ అండ్ డిసిషన్స్ (జీవితం, నిర్ణయాలు) శీర్షికతో రాసిన లేఖను గౌతమి బ్లాగులో పోస్టు చేశారు. అంతకు ముందు చిన్నపాటి ప్రకటన చేశారు. గుండె పగిలే ఆ నిజాన్నిఅంగీకరించడానికి, ఈ నిర్ణయం తీసుకోవడానికి తనకు చాలా కాలం పట్టిందని గౌతమి అన్నారు. దాదాపుగా రెండేళ్ల కాలం పట్టిందని ఆమె అన్నారు.

English summary
After living together for 13-long-years, Tamil megastar Kamal Haasan and southern star Gautami have parted ways. In a post on her personal blog, Gautami confirmed the news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu