»   » బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’:ఆశ్చర్యపరిచే విషయాలు, 99లో 17 అవే

బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’:ఆశ్చర్యపరిచే విషయాలు, 99లో 17 అవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్న వందో చిత్రం 'గౌతమీ పుత్రశాతకర్ణి'. క్రిష్‌ దర్శకత్వం వహిస్తారు. వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. బిబో శ్రీనివాస్‌ సమర్పిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ చిత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ప్రకటించారు. ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు మీకు అందిస్తున్నాం.

అందులో మొదటిది బాలయ్య ద్విపాత్రాభినయం. బాలకృష్ణ కు ద్విపాత్రాభినయం కొత్తేమి కాదు. ఆయన ఇప్పటికి తను నటించిన 99 చిత్రాల్లో 17 చిత్రాలు ద్విపాత్రాభినయం చేసారు. ఇప్పుడు మరోసారి ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తన వందో చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించనున్నారు.

ఈ చిత్రంలో ఈ జనరేషన్ కు చెందిన వ్యక్తిగానూ, శాతవాహన సామ్రాజ్యాన్ని ఏలిన గౌతమి పుత్ర శాతకర్ణిగా ఆయన ద్విపాత్రాభినయం చేసి మెప్పించనున్నారు. అలాగే ఈ చిత్రంలో కంచెలో లాగానే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని కాంటంపరరీ ఇష్యూలను సినిమాలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి నాటికి, ఇప్పటి కాలానికి మధ్య జరుగుతుంది. ఆ కాలానికి ఈ కాలానికి మధ్య వ్యత్యాసం చూపుతుంది. చివర్లో మళ్లీ ఆ నాటి రోజులు రాబోతున్నాయని హింట్ ఇస్తారు.

కాబట్టి ఇక్కడ మనికి అర్దం అయ్యేది ఏమిటీ అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అనేది రెగ్యులర్ హిస్టారికల్ డ్రామా మాత్రం కాదు. ఈ సినిమాలో స్ట్రాంగ్ మెసేజ్ ఈ కాలం యువతకు కావాల్సిన కొన్ని అంశాలు కలగలపి ఉంటాయి.

ఉగాది రోజు లాంచ్ అయిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున బాలకృష్ణ కెరీర్ లోనే నిలిచిపోయే చిత్రంగా రూపొందింస్తారు. సంక్రాంతి 2017 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇప్పటివరకూ వచ్చిన బాలయ్య..డ్యూయి ల్ రోల్ మూవీస్ స్లైడ్ షోలో

అపూర్వ సహోదరులు

అపూర్వ సహోదరులు

1986 వచ్చిన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకుడు, ఈ చిత్రంలో అన్నదమ్ములుగా కనిపిస్తారు.

రాముడు...భీముడు

రాముడు...భీముడు

1988లో వచ్చిన ఈ చిత్రానికి కె మురళిమోహన్ రావు దర్శకుడు. ఇందులో అన్నదమ్ములుగా కనిపిస్తారు.

బ్రహ్మర్షి విశ్వామిత్ర

బ్రహ్మర్షి విశ్వామిత్ర

1991లో ఎన్టీఆర్ దర్సకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హరిచంద్రుడుగానూ, దుష్యంతుడుగానూ బాలయ్య కనిపిస్తారు.

ఆదిత్యా 369

ఆదిత్యా 369

1991లో వచ్చిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. లవర్ బోయ్ , శ్రీకృష్ణదేవరాయులు గా ఆయన కనిపిస్తారు.

మాతో పెట్టుకోకు

మాతో పెట్టుకోకు

1995లో వచ్చిన మాతో పెట్టుకోకు చిత్రంలో అన్నదమ్ములుగా కనిపిస్తారు. ఎ కోదండ రామిరెడ్డి దర్శకుడు.

శ్రీకృష్ణార్జున విజయం

శ్రీకృష్ణార్జున విజయం

సింగీతం గారిదర్శకత్వంలో 1996లో వచ్చిన ఈ చిత్రంలో శ్రీకృష్ణుడుగానూ, అర్జునుడుగానూ బాలయ్య కనిపిస్తారు.

పెద్దన్నయ్య

పెద్దన్నయ్య

1997లో వచ్చిన పెద్దన్నయ్య చిత్రంలో అన్నదమ్ములుగా కనిపిస్తారు. శరత్ దర్శకుడు.

సుల్తాన్

సుల్తాన్

1999లో వచ్చిన ఈ చిత్రానికి శరత్ దర్శకుడు . ఇందులో అన్నదమ్ములుగా కనిపిస్తారు.

చెన్న కేశవరెడ్డి

చెన్న కేశవరెడ్డి

2002లో వివి వినాయిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తండ్రి, కొడుకులుగా కనిపిస్తారు.

అల్లరి పిడుగు

అల్లరి పిడుగు

2005లో జయంత్ సి పరాంన్జీ దర్సకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అన్నదమ్ములుగా కనిపిస్తారు.

ఒక్క మగాడు

ఒక్క మగాడు

2008లో వైవియస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఒక్క మగాడులో తాతగా,మనవడుగా కనిపిస్తాడు.

పాండురంగడు

పాండురంగడు

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 2008లో వచ్చిన పాండురంగడులో శ్రీకృష్ణుడుగా, పండరీకుడుగా కనిపిస్తాడు.

సింహా

సింహా

2010లో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సింహాలో తండ్రి, కొడుకులుగా కనిపిస్తాడు.

పరమవీర చక్ర

పరమవీర చక్ర

2011లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర చిత్రంలో ఆర్మీ మేజర్ గానూ, నటుడుగానూ కనిపిస్తాడు.

అధినాయకుడు

అధినాయకుడు

2012లో పరుచూరి మురళి దర్సకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ...తాత,తండ్రి, మనువడుగా త్రిపాత్రాభినయం చేసారు.

లెజండ్

లెజండ్

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఘన విజయం సాధించిన ఈ చిత్రం 2014లో రిలీజైంది. ఇందులో బాలయ్య జయదేవ్ గా, కృష్ణగా కనిపించారు.

లయిన్

లయిన్

2015 లో .సత్యదేవ్ దర్శకత్వంలో రూపొందిన లయిన్ చిత్రంలో గాడ్సే గా, బోస్ గా రెండు విబిన్నమైన పాత్రలను పోషించారు బాలయ్య.

English summary
Nandamuri Balakrishna's Gautamiputra Satakarni is not just another regular historical drama film, as it will have a strong message in it for youth of this generation.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu