»   » అసలు లెక్కలు ఎవరు చెప్తారు? బాలయ్య బయ్యర్లకు నష్టాలొచ్చాయా..??

అసలు లెక్కలు ఎవరు చెప్తారు? బాలయ్య బయ్యర్లకు నష్టాలొచ్చాయా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాంతి బరిలో దుమ్మురేపిన సినిమాలు రెండూ కలెక్షన్లలో మేమే ఎక్కువ అంటే మేమే ఎక్కువ అని చెప్పుకున్నారు. కానీ ఎవరి లెక్క ఎంతో ఖచ్చితంగా చెప్పలేదు ముఖ్యంగా "గౌతమీపుత్ర శాతకర్ణి" మూవీ కలెక్షన్స్ మీద వచ్చే వార్తలు చూస్తూంటే కొంత గంధరగోళంగానే ఉంది.

ఈ మధ్య కొన్ని మీడియా ఛానల్స్., వెబ్‌ మీడియా బయటపెట్టిన "గౌతమీపుత్ర శాతకర్ణి"కలెక్షన్స్ ని చూస్తే మాత్రం ఈ మూవీ ఇప్పటి వరకూ 60 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టిన్నట్టు కనిపిస్తోంది. కానీ బయట టాక్ ఏమో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని కొల్లగొట్టిందనేది అందరూ భావిస్తున్నారు.


Gautamiputra Satakarni collections

అయితే ఈ 60 కోట్లుకూడా ఇది ఇండియాలో వచ్చిన గ్రాస్ గా ఇండస్ట్రీలో చూపిస్తున్న లెక్కలు. ఇదీ తక్కువ అమౌంట్ కాకపోయినప్పటికీ లాభాలను ఒకస్థాయిలో ఆశించి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన నిర్మాతలకి ఈ అమౌంట్ అంతగా సంతృప్తి కలింగించలేదన్నట్టు వచ్చే వార్తలు బాలయ్య అభిమానులకి చికాకు గానే ఉంటున్నాయి. అయితే ఇక్కడో సంగతేమిటంటే నిర్మాతలు మాత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి" మూవీ రిలీజ్ నాటికే లాభాలను చూశారు. కానీ అసలు దెబ్బ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కే అనీ వారే కొంత నష్టాలు చూడాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం ఓవర్‌సీస్ లో మాత్రం భారీగానే కలెక్షన్స్ రాబట్టింది.


వీటి విలువ దాదాపు 7 కోట్ల రూపాయలుంటుందట. కానీ ఇండియాలో వరకూ చూస్తే శాతకర్ణికి కలెక్షన్స్ తక్కువుగా వచ్చాయని చెప్పవచ్చు. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ కి కొంత నష్టం వాటిల్లిందని అంటున్నారు. మొత్తంగా "గౌతమీపుత్ర శాతకర్ణి" కలెక్షన్స్ పై నిర్మాతలు అఫిషియల్ గా అయినా...లేక లీకేజీల రూపంలో అయినా వివరాలు వెల్లడిస్తే బాగుంటుందన్నది అందరి అభిప్రాయంగా వినిపిస్తోంది మరి.

English summary
Balakrishna Gautamiputra Satakarni Results in confusion, Profit to Producers and loss to the distributors?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu