»   » నారా రోహిత్ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో కన్ఫర్మ్!

నారా రోహిత్ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో కన్ఫర్మ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాణం' చిత్రంతో హీరోగా తెరంగ్రేటం చేసిన నారా రోహిత్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో ఉండబోతోందని సమచారం. ఈ మేరకు కొన్ని సిట్టింగ్స్ జరిగాయని ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం చేస్తున్నారని తెలుస్తోంది. ఏ మాయ చేసావె చిత్రంతో నాగచైతన్యకు హిట్ ఇచ్చిన గౌతం మీనన్...నారా రోహిత్ ను కూడా కమర్షియల్ హీరోగా నిలబెడతాడని ఆశిస్తున్నారు. ప్రస్తుతం గౌతం మీనన్ తమిళంలో సమీరా రెడ్డి ప్రధానపాత్రలో ఓ ధ్లిల్లర్ చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన వెంటనే నారా రోహిత్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Please Wait while comments are loading...