»   »  హాట్ బ్యూటీ అనుష్కకు దర్శకుడి వార్నింగ్

హాట్ బ్యూటీ అనుష్కకు దర్శకుడి వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాట్ బ్యూటీ అనుష్కకు తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ హీరోగా గౌతం మీనన్ తెరకెక్కిస్తున్న సినిమాలో అనుష్క కథానాయికగా నటిస్తోంది. ముందుగా కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం అనుష్క షూటింగుకు హాజరు కాక పోవడమే దర్శకుడి ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.

అనుష్క కమిట్మెంట్ ఇవ్వడంతో షూటింగుకు ప్లాన్ చేసుకున్న గౌతం మీనన్ ఆమె రాకపోయేసరికి షూటింగ్ కేన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందట. దీంతో షెడ్యూల్ కాన్సిల్ కావడంతో ఇతర ఆర్టిస్టుల డేట్స్ కూడా వేస్ట్ అయిపోయాయని, నిర్మాతకు లాస్ వచ్చిందని టాక్.

 Gautham Menon warns Anushka

ఈ పరిణామాలతో దర్శకుడు గౌతమ్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడని అంటున్నారు. మరోసారి ఇలా జరిగితే నిర్మాతల మండలికి కంప్లైంట్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడట. మరో వైపు అనుష్క గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' షూటింగులో, రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' చిత్రంలో నటిస్తోంది.

మరో వైపు ఇటీవల రజనీకాంత్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న 'లింగా' చిత్రం కూడా ఒప్పుకుంది. ఈ మూడు చిత్రాల షూటింగుల కారణంగా గౌతం మీనన్ కు ముందుగా కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం షూటింగుకు హాజరు కాలేక పోయిందట అనుష్క.

English summary
Anushka Shetty is playing the leading lady opposite Ajith in a film, which is being directed by Gautham Menon. Trisha will be play a key role in this film. Gautham Menon has reportedly got annoyed with Anushka, as the shooting of the film has recently got interrupted due to Anushka's problems with dates.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu