twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుక్ విమాన ప్రమాదంలో దుర్మరణం అంటూ.. సోషల్ మీడియాలో వైరల్..

    ప్యారిస్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ మరణించాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు వైరల్‌గా మారడం బాద్షా అభిమానులను అందోళనకు గురిచేసింది. నిజానికి షారుక్ ఖాన్ ప్రస్తుతం దర్శకుడు ఆనంద్

    By Rajababu
    |

    సోషల్ మీడియా బూటకపు ప్రచారంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ సారి బలిఅయ్యాడు. ప్యారిస్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ మరణించాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు వైరల్‌గా మారడం బాద్షా అభిమానులను అందోళనకు గురిచేసింది. నిజానికి షారుక్ ఖాన్ ప్రస్తుతం దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ రూపొందించే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ షూటింగ్‌ సందర్భంగా షారుక్ స్వల్ప ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే షారుక్ విమాన ప్రమాదంలో మరణించారనే వార్తలు బాలీవుడ్‌ వర్గాలను షాక్‌కు గురిచేశాయి.

    సోషల్ మీడియాతో ఇష్టారాజ్యం

    సోషల్ మీడియాతో ఇష్టారాజ్యం

    మొబైల్ ఫోన్ వినియోగదారుల చేతిల్లోకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత రూమర్లను షేర్ చేయడం ఇష్టారాజ్యంగా మారింది. తాజా షారుక్ ఖాన్ ఉదంతంలో చాలా దారుణమైన విషయం చోటుచేసుకొన్నది. కూతురు సుహానా జన్మదిన వేడుకలు జరిగిన కొద్ది గంటలకే షారుక్ విమాన ప్రమాదంలో మరణించాడనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.

    సహాయకులతో సహా..

    సహాయకులతో సహా..

    గల్ఫ్ స్ట్రీమ్ జీ550 విమానంలో తన సహాయకులతోపాటు, ఇతర సన్నిహితులతో ప్రయాణిస్తుండగా ఫ్లయిట్ క్రాష్ అయింది అని నకిలీ వార్తలను ప్రచారం చేశారు. దీంతో షారుక్ సన్నిహితులతోపాటు పలువురు ఆయా వార్త సంస్థలకు ఫోన్ చేసి అసలు విషయాన్ని తెలుసుకొన్నారు.

    బిజినెస్ మీటింగ్‌కు వెళ్తూ..

    బిజినెస్ మీటింగ్‌కు వెళ్తూ..

    ఇంకా ఆ ఫేక్ న్యూస్ సారాంశమేమిటంటే ఓ బిజినెస్ మీటింగ్‌కు వెళ్తుంటే ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. షారుక్ ఖాన్ ఇక లేరు అంటూ వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఇలాంటి వార్తలు రావడం ఇదే కొత్తకాదు. గతంలో కూడా పలువురు వార్తల బారిన పడ్డారు.

    ఎంత నమ్మశక్యంగా ఉన్నాయంటే..

    ఎంత నమ్మశక్యంగా ఉన్నాయంటే..

    ఫ్రాన్స్ విమానయాన సంస్థ పేరు, ఎయిర్ ఫ్రాన్స్ విమానం నంబరు స్పష్టంగా పేర్కొనడం ద్వారా నెటిజన్లు ఆందోళనకు గురయ్యారు. ఆ వివరాల ఆధారంగా విమాన ప్రమాదం నిజమో అని నమ్మాల్సిన పరిస్థితిని గాసిప్ రాయుళ్లు కల్పించారు.

    విమానం ల్యాండిగ్ కాకపోవడంతో..

    విమానం ల్యాండిగ్ కాకపోవడంతో..

    షారుక్ విమాన ప్రమాదం గురించి ఎలాంటి కట్టుకథ అల్లారంటే.. విమానం ల్యాండిగ్ కావడానికి కష్టం అయింది. సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. అయితే షారుక్‌ను రక్షించడంలో విఫలమయ్యాడు. ఫ్రాన్స్ విమానయాన సంస్థ శకలాల గాలింపు చేపట్టింది అని ఫేక్ న్యూస్‌ను వైరల్ చేశారు.

     బిగ్ బీ, ఐష్‌కు తప్పలేదు..

    బిగ్ బీ, ఐష్‌కు తప్పలేదు..

    గతంలో ఇలాంటి వార్తల బారిన బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు పడ్డారు. బిగ్ బీ అమితాబ్ ఇకలేరు అని, ఐశ్వర్యరాయ్ ప్రమాదంలో మరణించింది అని, సిల్వస్టర్ స్టాలన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందారనే వార్తలు అభిమానులను నివ్వెరపాటుకు గురిచేశాయి.

    English summary
    Superstar Shahrukh Khan has become the latest victim of a death hoax row. A story about Shahrukh Khan's death is going viral on the Internet. According to it, the actor got killed in a plane crash in Paris, which obviously is not true as he is busy shooting for Aanand L. Rai's next.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X