For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గోపిచంద్ కు టెన్షన్?: ఆపేసిన ప్రాజెక్టు మొదలైంది

  By Srikanya
  |

  హైదరాబాద్: సాధారణంగా ఒక హీరోకు హిట్ రాగానే అంతకు ముందు వివిధ కారణాలతో ఆగిపోయిన చిత్రాలు మళ్లీ ప్రాణం పోసుకుంటూంటారు. హిట్ ని క్యాష్ చేసుకోవటానికి ఉత్సాహం చూపిస్తూంటాయి. దాంతో హీరోకు టెన్షన్ ప్రారంభమవుతూంటుంది. ఇప్పుడు గోపిచంద్ ది అదే పరిస్ధితి అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గతంలో గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఆగిపోయిన సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. గోపీచంద్, ప్రకాష్ రాజ్ మరియు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సోమవారం హాస్పిటల్ సన్నివేశాలను చిత్రీకరించారు.

  ఫైనాన్స్ కారణాలతో కొంతకాలం, కథ సరిగ్గా రాక కొంతకాలం, దర్శకుడు మార్పుతో కొంతకాలం ఈ ప్రాజెక్టు వెనక పడింది. అయితే ‘లౌక్యం' హిట్ అవటంతో తిరిగి పట్టాలు ఎక్కింది. బి.గోపాల్ ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చెయ్యాలని తీర్చి దిద్దుతున్నారని టాక్. ఈ చిత్రంలో గోపీచంద్..పోరాట వీరుడుగా కనిపించనున్నారని చెప్తున్నారు.

  ''ఓ వీరుడి పోరాటం... ఈ చిత్రం. అతని ప్రయాణం ఎందుకోసమో తెరపై చూస్తే తెలుస్తుంది. ఈ యాక్షన్‌ చిత్రంలో ప్రేమ భావనలకూ చోటుంది. గోపీచంద్‌, నయనతార జంట ఆకట్టుకొంటుంది''అని దర్శకుడు చెప్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది

  ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''యాక్షన్‌, వినోదం మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్‌ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తయారవుతుంది. రిలీజ్,ఆడియో వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాము''అన్నారు.

  Gopichand-B Gopal film revived

  తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. కెమెరా: బాలమురుగన్‌. కొమర వెంకటేష్ సమర్పణలో జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  ఈ చిత్రం తో పాటు...

  యు.వీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా గా మిర్చి చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ తాజాగా గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశిఖన్నా హారోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా చంద్రశేఖర్ ఏలేటి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. న్యూ ఇయిర్ సందర్భంగా ఈ చిత్రానికి 'జిల్' అనే టైటిల్ ని ఖరారు చేసి ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.

  గత చిత్రాలకు పూర్తి భిన్నంగా గోపీచంద్ స్టెలిష్ లుక్‌తో కనిపించబోతన్నట్టు చిత్ర వర్గాల సమాచారం. హీరో గోపీచంద్ కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా వున్నట్లు తెలిసింది. ఇందులో గోపీచంద్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, ఆయన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రమవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ హంగులతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎనభై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

  పూర్తి కమర్షియల్ హంగులతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నారు. రన్ రాజా రన్ చిత్రానికి సూపర్ హిట్ సంగీతం అందించిన ఘిబ్రాన్ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం చేస్తున్నారు.

  చిత్రంలో చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.

  ఈ చిత్రానికి కాస్ట్యూబ్ డిజైనర్: తోట విజయభాస్కర్, ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్: అనల్ అరసు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్, మ్యూజిక్: ఘిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్

  English summary
  The long delayed film in the combination of Gopichand and B Gopal has been revived finally. B Gopal makes a comeback after a long time with this film which is being produced by Thandra Ramesh. Nayanathara pairs up with Gopichand and Mani Sharma composes the music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X