»   » నిర్మాతను గోపించంద్ నిలువునా ముంచేసాడా?

నిర్మాతను గోపించంద్ నిలువునా ముంచేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గోపీచంద్ వరసగా రెండు ప్రాజెక్టులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాధాకృష్ణ కుమార్ అనే నూతన దర్శకుడుతో ఆయన సినిమా ప్రారంభించగానే...ఇక బి.గోపాల్ ఆయన అంతకు ముందు షూట్ చేసిన సినిమా పరిస్ధితి ఏమిటీ అంటున్నారు. ఎక్కడా గోపీచంద్ ఆ చిత్రం గురించి మాట్లాడటం లేదు. దాంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అంటున్నారు. మరి ఆ నిర్మాతల పరిస్ధితి ఏమిటని,గోపీచంద్ ని నమ్ముకుని రెండు సార్లు డైరక్టర్ ని మార్చినా సినిమా ఫినిష్ చేయలేకపోయారు. దాంతో ఇప్పుడా నిర్మాతల గురించే అంతటా చర్చ జరుగుతోంది. ఫైనాన్స్ సమస్యలతో ఆగినట్లు చెప్తున్నా...సినిమా భూపతి పాండ్యన్ తో ప్రారభమైనప్పుడే పూర్తయితే ఈ సమస్య రాకపోను అంటున్నారు. అప్పుడు గోపీచంద్ ఇన్వాల్వమెంట్ తోనే ఆగిపోయిందని వినికిడి.

రెండు పాటలతో సహా దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తయైన ఈ చిత్రం ఆగిపోవటం అంటే నిర్మాతను నిట్టనిలవునా ముంచేసినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ నిర్మాతకు న్యాయం చేయటానికి గోపిచంద్ ఏం నిర్ణయం తీసుకున్నారు. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్‌ కు ఈ సినిమా ఆగిపోవటం అనేది ప్రస్టేజ్ సమస్యే. అయితే గోపిచంద్ మంచి వ్యక్తి అని...ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పది ఆలోచించే తీసుకుంటాడు కాబట్టి...ఈ సినిమాపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముందని కొందరంటున్నారు.

Gopichand-B.Gopal Movie Was Stopped?

క్రితం సంవత్సరం క్రితం... గోపీచంద్ హీరోగా, నయనతార హీరోయిన్ గా వీరిరువురి మొట్టమొదటికాంబినేషన్‌తో, సంచలన దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో నిర్మాత తాండ్ర రమేష్, జయబాలాజీ రియల్ మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపైన ఓ భారీ చిత్రాన్ని ఆగస్టు 16న షూటింగ్ ముహుర్తంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షుటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్..పోరాట వీరుడుగా కనిపించనున్నారని మీడియాకు అప్పట్లో చెప్పారు. అందు నిమిత్తం మంచి బడ్జెట్ ని కూడా పెట్టారు. ఇప్పుడు ఆ నిర్మాతలుకు మొండి చెయ్యేనా అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.


ఇక గోపీచంద్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ నిర్మాతలు. హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. నిర్మాతలు మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. చంద్రశేఖర్‌ యేలేటి దగ్గర పనిచేసిన రాధాకృష్ణకుమార్‌ తయారు చేసిన కథ, కథనాలు చాలా బాగున్నాయి. మణిశర్మ తనయుడు సాగర్‌ మహతి సంగీతం అందిస్తున్నారు. జూన్‌ 6 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామ''న్నారు. చలపతిరావు, బ్రహ్మానందం, సుప్రీత్‌, కబీర్‌, హరీష్‌ ఉత్తమన్‌, శ్రీనివాస్‌ అవసరాల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: శక్తిశరవణన్‌

English summary
Gopichand's movie with B Gopal is almost shelved due to financial problems and nobody is able to tell the time it takes to start again. With almost 60 percent shooting completed, Producer dropped the film siting financial troubles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu