»   » ప్రియమణి లేనిదే ఉండలేనంటున్న గోపీచంద్?

ప్రియమణి లేనిదే ఉండలేనంటున్న గోపీచంద్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపిచంద్..ప్రియమణి కాంబినేషన్లో గోలీమార్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం చేస్తున్నప్పుడు గోపీచంద్ పూర్తిగా ప్రియమణి ప్రేమలో మునిగితేలాడని చెప్పుకుంటున్నారు. అప్పటివరకూ అనూష్క మీద కన్ను ఉన్న గోపీచంద్ ఈ దెబ్బతో ఆమెను వదిలి ప్రియమణే సర్వం అన్నట్లు బిహేవ్ చేస్తున్నాట్ట. అంతేగాక రచయిత నుంచి దర్శకుడుగా మారిన బి.వియస్ రవి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా ఆమెను పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్నాట్ట. ఆ చిత్రాన్ని గతంలో గోపీచంద్ తో శౌర్యం తీసిన భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఆ దర్శక, నిర్మాతలు వేరే అమ్మాయితో చేద్దామన్నా గోపీచంద్ పడనిచ్చేటట్లు లేడట.

ఇక ప్రియమణి ఎక్కడ పనిచేస్తే అక్కడ వారిని మెస్మరైజ్ చేయటం కామన్ అని తెలిసున్నవారు అంటున్నారు. బెల్లంకొండ ప్రొడక్షన్ లో శంభో శివ శంభో కి చేసిన ఆమె వెంటనే బెల్లంకొండ నెక్ట్స్ ప్రొడక్షన్ గోలీమార్ లోనూ ఆఫర్ సంపాదించింది. అలాగే రాజమౌళి దగ్గర యమదొంగ కి పనిచేసి ...ఆ తర్వాత ఆ సినిమాకు పనిచేసిన ఇద్దరు అశోసియేట్స్ (ద్రోణ..కరుణ కుమార్, మిత్రుడు..మహదేవ్) సినిమాలు సంపాదించింది. అలాగే జగపతి బాబుతో పెళ్ళయిన కొత్తలో చిత్రం చేసి ఆ తర్వాత ప్రవరాఖ్యుడు, సాధ్యం చిత్రాలు అవకాశాలు సంపాదించింది. అక్కడ నుంచి దర్శకుడు పూరీ రికమండేషన్ తో వర్మ రక్త చరిత్రలో స్ధానం సంపాదించింది. కాబట్టి ప్రియమణి ఎక్కడ పనిచేస్తే అక్కడ వారిని తన మాటలతో, చేష్టలతో కట్టిపారేస్తుందంటున్నారు. అలాగే ప్రస్తుతం చిక్కుకున్న గోపీచంద్..రాత్రింబవళ్ళు ఆమె ధ్యాసలోనే ఉంటున్నాడని ఫిల్మ్ సర్కిల్సో లో గుసగుసలాడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu