»   » ఆనంద ప్రసాద్ తో గోపీచంద్ మరో సినిమా

ఆనంద ప్రసాద్ తో గోపీచంద్ మరో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపిచంద్ హీరోగా కెమెరామెన్ శివ ని డైరక్టరక్ గా పరిచయం చేస్తూ శౌర్యం చిత్రాన్ని నిర్మాత ఆనంద్ ప్రసాద్ రూపొందించిన సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పై వచ్చిన ఆ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. అదే విజయాన్ని కొనసాగించటానికి గోపీచంద్ మరోసారి అదే బ్యానర్ పై చిత్రం చేయటానికి సైన్ చేసారని విశ్వసనీయ సమాచారం. దర్శకుడుగా ఓ తమిళయన్ పరిచయం కానున్నాడని తెలుస్తోంది. ఇక స్టోరీ సిట్టింగ్ లలో గోపీచంద్ ఇన్వాల్స్ అవుతున్నారని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం గోపిచంద్..పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో గోలీమార్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా తయారవుతోంది. అలాగే గోపీచంద్, పరుశరామ్(యువత ఫేమ్) దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆనంద ప్రసాద్..శౌర్యం అనంతరం అల్లరి రవిబాబు దర్శకత్వంలో అమరావతి చిత్రం రూపొందించారు. అది భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu