»   » ఎన్టీఆర్ కు స్క్రిప్టు నేరేట్ చేస్తున్న రామ్ డైరక్టర్

ఎన్టీఆర్ కు స్క్రిప్టు నేరేట్ చేస్తున్న రామ్ డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ తో రీసెంట్ గా పండుగ చేస్కో చిత్రం చేసిన గోపీచంద్ మలినేని తన తదుపరి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మురుగదాస్ అందిస్తున్న కథను ఎన్టీఆర్ కు నేరేట్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి దిల్ రాజు,మురుగదాస్ కలిసి నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ కు మరికొద్ది రోజుల్లో కథని నేరేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఓకే చేస్తే వెంటనే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కానుంది.

మరో ప్రక్క...

శ్రీమంతుడు ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రం షూటింగ్ పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ జరగుతుందని వినపడుతోంది.

 Gopichand Malineni to narrate script to NTR

నిజానికి రామయ్యావస్తావయ్యా చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమా చేయడం, అదే టైం లో మహేశ్ బాబు తో శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివ కమిట్ అవడంతో.. ఈ కాంబినేషన్ వాయిదా పడింది. ఇక ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే... ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత.

ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాకు 'నాన్నకు ప్రేమతో' అనే పేరును ఖరారు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌ స్త్టెలిష్‌గా కనిపిస్తున్నారు.

 Gopichand Malineni to narrate script to NTR

దర్శకుడు మాట్లాడుతూ ''కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్‌ పాత్రలోనూ, ఆయన తెరపై కనిపించే విధానంలోనూ వందశాతం వైవిధ్యం చూస్తారు ప్రేక్షకులు. నేను, ఎన్టీఆర్‌ కలిసి తొలిసారి చేస్తున్న ఈ సినిమా మా ప్రయాణంలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంద''న్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ప్రచార చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. విజయదశమికి టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. ఎన్టీఆర్‌, సుకుమార్‌ కలయికలో వస్తున్న ఈ చిత్రం మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఈ నెల 24 వరకు లండన్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

English summary
According to our sources, director Gopichand Malineni will be narrating a script to NTR in a couple of days. Gopichand Malineni who shot to fame with two back to back hits – Balupu and Pandaga Chesko reportedly readied an interesting storyline that will further be developed by none other than A. R. Murugadoss if NTR likes the plot. NTR is committed to do a movie for top producer Dil Raju, who arranged this meeting. Let’s see this
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu