For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Balakrishna కోసం పవర్ ఫుల్ టైటిల్ సిద్దం చేసిన మలినేని.. మాములుగా లేదుగా!

  |

  నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ సవ్యంగా జరిగితే ఈపాటికి సినిమా రిలీజ్ కూడా అవ్వాల్సి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు సినిమా షూటింగ్ పనులు పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి పరిశీలిస్తే

  భారీ అంచనాలు

  భారీ అంచనాలు

  ఎప్పుడో 2016 సంవత్సరం లో నందమూరి బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో హిట్ కొట్టారు. ఆ తర్వాత ఆయన దాదాపు నాలుగైదు సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. తన తండ్రి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన రెండు సినిమాలు కూడా అనూహ్యంగా షాకిస్తూ సరైన స్పందన తెచ్చుకోలేక పోయాయి. చివరికి ఆయన తనకు రెండు హిట్ సినిమాలు అందించిన బోయపాటితో సినిమా ప్లాన్ చేశారు, అలా వీరి కాంబోలో మూడవ సినిమా మొదలైంది.

  ఆ డైరెక్టర్

  ఆ డైరెక్టర్

  సింహా, లెజెండ్ లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తెరకెక్కుతున్న అఖండ అనే సినిమా మీద కూడా ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా మీద అటు బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాక సాధారణ ప్రేక్షకులు సైతం చాలా అంచనాలు పెట్టుకున్నారు. దానికి కారణం ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తూ ఉండడమే.

   బాలకృష్ణ - గోపీచంద్ మలినేని

  బాలకృష్ణ - గోపీచంద్ మలినేని

  మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య ఈ సినిమాలో ఒక బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతూ ఉండడంతో పాటు ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ లో కూడా ఆయన అఘోరాలా కనిపించడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో సినిమా ప్రారంభించాలని అనుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

  ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్

  ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్


  పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక చరిత్రకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. అందులో ఒకటి ఫ్యాక్షన్ లీడర్ పాత్ర కాగా మరొకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ సినిమా కోసం ఒక పవర్ ఫుల్ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారని అంటున్నారు.

  పవర్ ఫుల్ టైటిల్

  పవర్ ఫుల్ టైటిల్


  ఈ సినిమా కోసం రౌడీయిజం అనే టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. అంతే కాక ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్న నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ముందు శ్రుతి హాసన్ ను సంప్రదించగా ఆమె చేయడానికి ఒప్పుకోలేదు అని, తర్వాత గోపీచంద్ కోసం ఆమె బాలకృష్ణ సరసన నటించేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరగగా అది నిజం కాదని తేలింది.

  Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Filmibeat Telugu
  అఖండ రిలీజ్ కోసం వెయిటింగ్

  అఖండ రిలీజ్ కోసం వెయిటింగ్


  ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో ఇలియానా కూడా హీరోయిన్ గా నటిస్తోంది అని అంటున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమా నిర్మిస్తోంది. మరో పక్క బాలకృష్ణ అభిమానులు అఖండ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Gopichand Malineni is going to helm the upcoming project of Nandamuri Balakrishna has finalized heroine for balakrishna. as per reports shruth hassan gave nod to act with balakrishna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X