»   » 'భాయ్‌'దర్శకుడుకి హ్యాండ్... వీరూ పోట్ల తో సై??

'భాయ్‌'దర్శకుడుకి హ్యాండ్... వీరూ పోట్ల తో సై??

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఇక్కడ ప్రతీ శుక్రవారం లెక్కలు మారిపోతూంటాయి. రీసెంట్ గా గోపీచంద్ దర్సకుడు మారాడని వినికిడి. భాయ్ చిత్రంతో డిజాస్టర్ ఫలితం చవిచూసిన వీరభధ్రంతో గోపీచంద్ చిత్రం ఉంటుందని అంతటా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి 'దూసుకెళ్తా' చిత్రం తో విజయం సాధించిన దర్శకుడు వీరూపోట్ల వచ్చాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మేరకు వీరూ ఇప్పటికే ఓ స్క్రిప్టు చెప్పి గోపీచంద్ చేత ఒకే చేయించాడని తెలుస్తోంది. అదే పట్టాలెక్కే అవకాసం ఉందని, 'భాయ్‌'దర్శకుడుకి హ్యాండ్... ఇచ్చినట్లే అని..వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది అధికారికంగా న్యూస్ వస్తేనే కానీ తెలియదు.

2014 పిబ్రవరిలో ఈ కాంబినేషన్ సెట్స్‌కెళుతుందని తెలుస్తోంది. ఏదేమైనా ఇది వీరూ కెరీర్‌కి ఉపయోగపడేదే అంటున్నారు. నాగార్జున తర్వాత మరో పెద్ద హీరోతో పనిచేసే సదవకాశమిది.
యాక్షన్‌ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకొన్నారు గోపీచంద్‌. ఇప్పుడు బి.గోపాల్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆ తరవాత సినిమాకీ సన్నాహాలు జరుగుతున్నాయి. భవ్య ఆర్ట్స్‌ సంస్థ గోపీచంద్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది.

అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను ఎంచుకొన్నట్టు సమాచారమ్‌. గోపీ, తమన్నాల కలయికలో ఇంత వరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ఈ జంట కొత్తగా ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. 'తడాఖా' తరవాత తమన్నా నటించిన చిత్రమేదీ తెలుగులో రాలేదు. ఇటీవలే 'ఆగడు'లో నటించడానికి ఒప్పుకొంది. త్వరలోనే 'ఆగడు' మొదలుకానుంది.

English summary
Doosukeltha & Ragada director Veeru Potla is all set to direct Gopichand's next. Sources close to the later suggest that Gopichand has okayed a story line and they will zero in on a producer soon to start Pre-Production. Gopichand is likely to do this film after finishing ongoing B.Gopal flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu