»   » గోపిచంద్‌ తో తమన్నా రొమాన్స్...డిటేల్స్

గోపిచంద్‌ తో తమన్నా రొమాన్స్...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : గోపీచంద్‌, తమన్నా కాంబినేషన్ లో చిత్రం రాబోతోందా అంటే అవుననే అంటు న్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అహనా పెళ్ళంట, పూలరంగడు, భాయ్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రమ్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. భవ్యక్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూర్తి స్ధాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్పుకుంటున్నారు.


గతంలో 'శౌర్యం", 'అమరావతి", 'వాంటెడ్‌" చిత్రాలు నిర్మించిన భవ్య క్రియేషన్స్‌ వీరభద్రమ్‌తో నిర్మించే చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా చేయనున్నాడు. వీరభధ్రమ్ చెప్పిన కథను విన్న గోపీచంద్ స్టోరీ లైన్ ఓకే చేసి కొన్ని స్క్రిప్టు కరెక్షన్స్ చెప్పాడని తెలుస్తోంది. ఇక నాగార్జున తో చేసిన భాయ్ చిత్రం పెద్దగా వర్కవుట్ కాకపోయినా దర్శకుడుగా బాగానే హ్యాండిల్ చేసాడనే పేరు మాత్రం వచ్చింది. దాంతో గోపీచంద్ ...చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం గోపీచంద్‌ బి.గోపాల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందు లో నయనతార హీరోయిన్. నిర్మాత తాండ్ర రమేష్, బి. గోపాల్-గోపీచంద్‌ల కాంబినేషన్‌తో నిర్మిస్తున్న తాజా చిత్రం గురించి చెబుతూ..బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నిర్మిస్తున్న మా చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని సెప్టెంబర్ 3 నుంచి స్విట్జర్లాండ్‌లో మొదలు పెట్టామన్నారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో రచయిత శ్రీమణి రాసిన రెండు యుగళ గీతాలను గోపీచంద్, నయనతారలపైన దినేష్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నామని తెలిపారు.


అలాగే తమన్నా తమిళంలో వీరం చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మహేష్‌తో కలిసి ఆగడు చేస్తోంది. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే....పలు సౌత్ ప్రాజెక్టులతో పాటు, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సాజిద్-పర్హాద్ 'ఇట్స్ ఎంటర్టెన్మెంట్స్' చిత్రంతో పాటు, సాజిద్ ఖాన్ 'హమ్ షకల్' చిత్రంలో నటిస్తోది. సౌత్‌లో సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ మూవీ 'వీరమ్'లో నటిస్తోంది. మహేష్ బాబు తర్వాతి సినిమా 'ఆగడు' చిత్రంలో కూడా తమన్నా హీరోయిన్‌గా ఎంపికయినట్లు తెలుస్తోంది.

English summary
Tamannaah has now signed a comedy flick opposite Gopichand. The film will be shot in both Tamil and Telugu and directed by tollywood director Veerabadra Chowdary. Meanwhile, Tamannaah has three other Tollywood projects in hand.
Please Wait while comments are loading...