»   » గోపీచంద్ కొత్త చిత్రం టైటిల్ ఏమిటంటే...

గోపీచంద్ కొత్త చిత్రం టైటిల్ ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రైటర్ బి.వి.యస్.రవి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా చేసే చిత్రానికి 'ఘరానా' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీక్షా సేధ్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ టైటిల్ తో పాటు 'నువ్వంటే నాకు పిచ్చి' అనే పేరు కూడా రిజిస్టర్ చేసారు. అయితే 'ఘరానా' నే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం రీసెంట్ గా గోపీచంద్ మ్యూజిక్ సిట్టింగ్స్ కి చక్రితో కలిసి ఖండాలా వెళ్ళివచ్చారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రం కోసం బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ చేయాల్సిన చిత్రం షూటింగ్ ఆపుచేసుకుని మరీ చిత్రం చేస్తున్నారు. గోలీమార్ చిత్రం తర్వాత చేస్తున్న ఈ చిత్రం గ్యారెంటిగా హిట్ ఇస్తుందని గోపీచంద్ భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu