»   »  అనూష్కకి ...గోపీచంద్ వార్నింగ్ ఇచ్చాడా?

అనూష్కకి ...గోపీచంద్ వార్నింగ్ ఇచ్చాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anushka
గత కొంత కాలంగా గోపీచంద్ ,అనూష్క మధ్య ఫ్రొపిషనల్ రిలేషన్ కాకుండా వేరే అనుభంధం ఉందనే వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడుగా మరో హాట్ గ్యాసిప్ బయిలు దేరింది. అనూష్క ..బికినీతో భిల్లా రీమేక్ లో నటిస్తోంది అని తెలియగానే గోపీచంద్ ఆమెకి ఫో్న్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చాడని. నయనతార తమిళ ఒరిజినల్ లో ఆ సన్నివేశాలతోనే టాప్ స్టార్ గా ఎదిగింది. దాంతో అనూష్క కూడా బికినీనే ...భవిష్యత్ కి రాచబాట అని ఆమె నమ్మింది.

దాంతో తాను అవసరం అవకాశం వస్తే బికినీతో నటించటానికి వెనుకాడనని ప్రకటించింది. అప్పటి వరకూ తన చిత్రంలో ఎవరు బికినీ వేస్తారా అని బెంగపెట్టుకున్న దర్శకుడు మెహర్ రమేష్ వెంటనే ఈ వార్త చూసి ఆనందంతో తన నిర్మాతలను ఆమె దగ్గరకు తరిమాడు. అలా ఆమె కోరి మరీ బికినీ ఆఫర్ ని పట్టుకుంది. మరిప్పుడు గోపీచంద్ వద్దంటున్నాడని వార్త . అంటే ఇది సైఫ్-కరీనాకపూర్ ల వ్యవహారంలా మారుతోందని అంటున్నారు. మొత్తానికి బికినీ వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టేలా ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X