»   » 'బాహుబలి-2' లో పెట్టుకోమంటూ హీరో ఫ్యాన్స్

'బాహుబలి-2' లో పెట్టుకోమంటూ హీరో ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరో గోపీచంద్‌ అభిమానులు, డైరక్టర్ రాజమౌళిని తన బాహుబలి-2 (ది కన్ క్లూజన్) లో తమ హీరోని పెట్టుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. అంతకు ముందు వీరిద్దరు కలసి చేసిన వర్షం సినిమా సూపర్ హిట్ అయ్యిందని గుర్తు చేసి మరీ చెప్తున్నారట. ఈ విషయమై సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ గోపిచంద్, ప్రబాస్ ఇద్దరు ఫొటోలు కలిపి షేర్ చేస్తూ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాకపోతే రాజమౌళి తన సొంత నిర్ణయాలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు, ఇది కనుక తన ఉహకు బాగుందనిపిస్తే ట్రై చేయ్యెచ్చు అని చెప్తున్నారు. అలాగే గోపీచంద్ మనస్సులోనూ ఇలాంటి ఆలోచన ఉందో లేదో మరి.

'సాహసం', 'లౌక్యం' 'జిల్‌' చిత్రాలతో వరుస విజయాలు అందుకొన్న గోపీచంద్‌ 'సౌఖ్యం‌'తో మరోసారి ముందుకు రాబోతున్నాడు. గోపీచంద్ హీరోగా, రెజీనా హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ''సౌఖ్యం'' . భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని, ఎ.ఎస్‌.ర‌వికుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు మినహా టాకీ పూర్తయ్యింది.


Gopichand will act on the film Baahubali -2.

నలుగురి క్షేమం కోరే వ్యక్తిగా, నలుగురి సౌఖ్యం కోసం ఏం చేయడానికైనా వెనకాడని వ్యక్తిగా గోపీచంద్ నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్ ఆరంభంలో 'యజ్ఞం' వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.


ద‌ర్శ‌కుడు ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ - ''ఎదుటివారి క్షేమ‌స‌మాచారాల‌ను క‌నుక్కోవ‌డం మ‌న‌కున్న సంస్కారం. అలాంటి సంస్కారం తెలిసిన యువకుడు త‌న వారి సౌఖ్యం కోసం, త‌న చుట్టూ ఉన్న వారి సౌఖ్యం కోసం యాక్షన్ నే చేశాడా? ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోనే కొన‌సాగాడా? అనేది ఈ సినిమాలో ప్రధానాంశం. గోపీచంద్‌, రెజీనా జంట చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప‌దేళ్ళ త‌ర్వాత గోపీచంద్‌తో మ‌ర‌లా ప‌నిచేస్తుంటే ఒక‌ర‌క‌మైన ఉత్సాహంగా ఉంది'' అని చెప్పారు.


Gopichand will act on the film Baahubali -2.

గోపీచంద్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు: శ్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్‌, నిర్మాత‌: వి.ఆనంద్‌ప్ర‌సాద్‌.

English summary
Gopichand fans are requesting Baahubali director to take into the movie cast in the sequel of the Baahubali movie.
Please Wait while comments are loading...