»   » ఏ మాయ చేసావే నిర్మాత మంజుల ఓ మోసగత్తె: గౌతమ్ మీనన్..!!

ఏ మాయ చేసావే నిర్మాత మంజుల ఓ మోసగత్తె: గౌతమ్ మీనన్..!!

Subscribe to Filmibeat Telugu

నాగ చైతన్య, సమంత నాయికానాయకులుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మంజుల నిర్మించిన చిత్రం ఏ మాయ చేసావే. గత శుక్రవారం విడుదలయిన ఈ చిత్రం తర్వాత గౌతమ్ మీనన్ ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే మహేష్ బాబు నాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్టు మంజుళ ప్రకటించింది. కానీ ఇప్పుడా సినిమాను చెయ్యబోనని గౌతమ్ ప్రకటించాడు. డబ్బు విషయంలో మంజుళ తనని మోసం చేసిందని సంచలన ప్రకటన చేసాడు.

సినిమా ప్రారంభానికి ముందు మంజుళ గౌతమ్ కు పారితోషికంతో పాటు లాభాల్లో 50% ఇస్తానని మాట ఇచ్చిందట. ఈ మేరకు ఆయనకు 3 కోట్ల రూపాయలు ముట్టజెప్పిందట. తీరా సినిమా విడుదల ఆలస్యం అవడంతో 3 కోట్లలో కొంత మొత్తం తనకు తిరిగి ఇవ్వాలని మంజుళ అడిగిందట. ఈ మేరకు నిర్మాత మండలిలో ఫిర్యాదు కూడా చేసిందట. ఈ వివాదంతో మనస్తాపం చెందిన గౌతమ్ తాను 1.6 కోట్లను వెనక్కు ఇచ్చేస్తున్నానని, కానీ తాను కేవలం 55 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తే మార్కెట్ చేసుకోవడంలో విఫలం అయిన ఆమె తిరిగి డబ్బు అడగటం తనని బాధించిందని, అందుకే మంజుళ, మహేష్ ల కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాను చెయ్యడం లేదని ప్రకటించాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu