»   »  'గోవిందుడు అందరివాడేలే' టీజర్ విడుదల తేదీ

'గోవిందుడు అందరివాడేలే' టీజర్ విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ చిత్రం టీజర్ రెడీ అయ్యిందని, అది అద్బుతంగా వచ్చిందని ఇప్పటికే బండ్లగణేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులను ఊరిస్తున్నారు. ఇంతకీ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే... చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ..." ఇప్పుడే గోవిందుడు అందరి వాడేలా ట్రైలర్ చూసాను. సూపర్బ్... మా గోవిందుడు ఇన్ని రంగుల మధ్య అన్ని హంగులతో చూస్తూంటే దసరా కే దసరా పండుగ " అన్నారు. ఈ ట్రైలర్ దసరా కి విడుదల చేయటానికి ముస్తాబు చేస్తున్నారన్నమాట. రామ్‌చరణ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

‘Govindhudu Andhari Vadele’ teaser for Krishna Vamsi birthday?

బండ్ల గణేష్ మాట్లాడుతూ... ''గోవిందుడు అందరివాడేలే' విషయంలో ఇటీవల అనేక వదంతులు వినవస్తున్నాయి. ఇది నాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సినిమా. కుటుంబ విలువలతో తెరకెక్కుతున్న అచ్చ తెలుగు చిత్రం. పది తరాల వారు గుర్తుంచుకునేలా ఉంటుంది. అందుకే ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేస్తున్నాం. ఈ క్రమంలో సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే రామ్‌చరణ్‌ తాత పాత్ర పోషించిన రాజ్‌కిరణ్‌ను మార్చాల్సి వచ్చింది '' అన్నారు.

అలాగే రాజ్ కిరణ్ తమిళ నటుడు కావడంతో నేటివిటీ సమస్య రాకుండా ఆయన స్థానంలో ప్రకాష్‌రాజ్‌ను ఎంపిక చేసుకున్నాం. దీని కోసం రాజ్‌కిరణ్‌గారికి క్షమాపణలు చెప్తున్నాను. ఇటీవల రామ్‌చరణ్‌ జ్వరంతో బాధపడటం, మండుటెండల్లో కళాకారుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోవడం.. వంటి కారణాలతో కొద్ది రోజులు చిత్రీకరణ నిలిపేశాం. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణ మొదలైంది.ఈ నెల 31 వరకు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ ఉంటుంది '' అన్నారు.

ఇక ఆగస్టు 1-15 మధ్య లండన్‌లో చిత్రీకరణ జరు పుతాం. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది. అక్టోబర్‌ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాం'' అన్నారు. శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


English summary
The trailer of ‘Govindhudu Andhari Vadele’ might come out for Krishna Vamsi’s birthday, which is on July 28.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu