Just In
- 2 min ago
రోజంతా గడుపుతా.. నేనే ఎక్కువగా బాధపడుతున్నా.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 9 min ago
మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన రవితేజ: ఆరోజే అలరించబోతున్న మాస్ మహారాజా
- 23 min ago
స్టార్ డైరెక్టర్ శిష్యుడితో నాగశౌర్య మరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ కొత్తగా ఉందే!
- 29 min ago
చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
Don't Miss!
- Finance
ఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయి
- News
కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు... తేల్చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్...
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లాభాలు రాకున్నా....రామ్ చరణ్ మూవీని అలా?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఎలాంటి ఫలితాలు సాధించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చింది. అయితే అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమా లాభాలు రాక పోగా...రామ్ చరణ్ కూడా తన రెమ్యూనరేషన్ కొంత నిర్మాత బండ్ల గణేష్‌కు తిరిగి ఇచ్చేసాడని అప్పట్లో టాక్.
ఇలాంటి సినిమాను ఇపుడు హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ ఆలోచన వచ్చింది మరెవరికో కాదు.... రీమేక్ చిత్రాల దర్శకడు ప్రభుదేవాకే నంట. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రభుదేవా చూసాడని, అతనికి నచ్చడంతో హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రామ్ చరణ్ తర్వాతి సినిమా విషయానికొస్తే...అతను త్వరలో శ్రీను వైట్ల చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రామ్ చరణ్ తో ఆమె చేస్తున్న తొలి సినిమా ఇదే కానుంది. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్.
సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని, జనవరి సెకండ్ వీక్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.
ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ గా రెజీనాగానీ, పూజా హెడ్గేను గానీ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.
రామ్ చరణ్ నటించిన చివరి చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా ఉండాలని కోరుకుంటున్నారు.