Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబు తల్లిగా ఆమెనా?
హైదరాబాద్ : నాగార్జునతో ‘సంతోషం' సినిమా చేసిన గ్రేసీ సింగ్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అంతేకాదు మోహన్ బాబు సరసన తప్పు చేసి పప్పు కూడు చిత్రం చేసింది. అలాగే అమీర్ ఖాన్ నటించిన ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ ‘లగాన్'లో కూడా ఆమె హీరోయిన్. అయితే ఆ తర్వాత ఆమెకు అంతగా ఆఫర్స్ రాలేదు. వివాహం చేసుకుని సెటిల్ అయ్యిపోయింది. అయితే ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సారి తల్లి పాత్రతో వస్తోంది. మహేష్ కు తల్లిగా ఆమె కనిపించనుందని సమాచారం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
వివరాల్లోకి వెళితే...కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో తల్లి పాత్రలో నటింపజేయడానికి గ్రేసీ సింగ్ ను సంప్రదించినట్టు సమాచారం. ఆమెకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 17 న మహా శివరాత్రి పూట విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే ఆ రోజు అభిమానుల ఆనందం ఏ రేంజిలో ఉంటుంమదో ఊహించండి. ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిర్మాత,దర్శకుడు ఇప్పటివరకూ ఏ టైటిలూ ప్రకటించలేదు.
శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.
అయితే తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో దర్శకుడు కొరటాల శివ తేల్చాల్సి ఉంది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఈ టైటిల్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా లేదని అంటున్నారు. ఈ టైటిల్ విషయమై కొరటాల శివ త్వరలోనే సోషల్ నెట్వర్కింగులో స్పందించే అవకాశం ఉంది.
మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్సకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.